Private Hospitals : హాస్పిటల్స్ అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి సంప్రదించాల్సిన నోడల్ అధికారుల వివరాలు, ఫోన్ నెంబర్లు

Hospitals Irregularities : కరోనా మహమ్మారిని అడ్డంపెట్టుకుని అడ్డంగా దోచేస్తోన్న ప్రయివేటు ఆసుపత్రుల అక్రమాలను ఏపీ సర్కారు సీరియస్‌గా తీసుకుంది...

Private Hospitals : హాస్పిటల్స్ అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి సంప్రదించాల్సిన నోడల్ అధికారుల వివరాలు, ఫోన్ నెంబర్లు
Follow us
Venkata Narayana

|

Updated on: May 20, 2021 | 12:38 PM

Hospitals Irregularities : కరోనా మహమ్మారిని అడ్డంపెట్టుకుని అడ్డంగా దోచేస్తోన్న ప్రయివేటు ఆసుపత్రుల అక్రమాలను ఏపీ సర్కారు సీరియస్‌గా తీసుకుంది. మానవత్వంతో వ్యవహరించాలని ఇప్పటికే ఎన్నోసార్లు విన్నపాలు చేస్తున్నా పట్టించుకోకుండా రూ. లక్షల్లో రోగుల నుంచి గుంజేస్తోన్న ఆస్పత్రులపై ఫిర్యాదు చేయడానికి సంప్రదించవలసిన నోడల్ అధికారుల వివరాలను ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయవాడలో వెల్లడించారు. బాధితులు ఫిర్యాదు చేయాల్సిన ఆయా అధికారుల వివరాలు.. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు ఇలా ఉన్నాయి :

1. శ్రీ ఎస్. రవి శంకర్ నారాయణ్, ఐఆర్ఎఎస్, డైరెక్టర్ జనరల్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, మొబైల్ నెం. : 8985972367 2. శ్రీ సుధీర్ కుమార్ రెడ్డి, ఐపీఎస్, ఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్, మొబైల్ : 9740081357 3. డాక్టర్. టి. గీతా ప్రసాదిని, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మొబైల్ : 9849902208

ఇదిలాఉండగా, ప్రైవేట్ ఆస్పత్రులు పద్దతి మార్చు కోకుండా అక్రమాలకు పాల్పిడితే ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సిబ్బందితో నిర్వహించడం జరుగుతుందని ఏపీలోని ఆయా జిల్లాల కలెక్టర్లు హెచ్చరికలు జారీచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న పలు ప్రయివేట్ ఆస్పత్రులకు ఇటీవల జిల్లా కలెక్టర్ మురళీధర రెడ్డి భారీగా జరిమానాలు విధించిన సంగతి తెలిసిందే. కొవిడ్ చికిత్స కోసం 50 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ, ఈ.హెచ్.ఎస్ పథకాల క్రింద నగదు రహిత చికిత్సకు కేటాయించక పోవడం, నిర్థేశించిన రేట్లకు మించి ఫీజులు వసూలు చేయడం, నిబంధనల ఉల్లంఘకు పాల్పడడం.. తదితర కారణాలపై 39 కొవిడ్ నోటిఫైడ్ ప్రయివేట్ ఆసుపతులకు భారీ జరిమానా వేశారు.

మొత్తంగా ఒక కోటి 54 లక్షల రూపాయల మేరకు పెనాల్టీ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, విజిలెన్స్ అధికారులు, క్లస్టర్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు నిర్వహించిన తనిఖీలలో జిల్లాలో కొవిడ్ చికిత్సకు నోటిఫై చేసిన 39 ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఈ బాగోతాలు బట్టబయలయ్యాయి. ఒక్కో ఆస్పత్రికి 2 లక్షల నుండి 10 లక్షల వరకూ ఫైన్ చొప్పున మొత్తం కోటీ 54 లక్షల పెనాల్టీ విధించామని కలెక్టర్ తెలిపారు. ఫైన్ మొత్తాన్ని ఆయా ప్రైవేట్ ఆసుపత్రులు 48 గంటలలోపు ఆరోగ్యశ్రీ అకౌంటుకు చెల్లించాలని కూడా ఆయన ఈనెల 15వ తేదీన ఆదేశించారు.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.