నాటు.. అదే రూటు..! పక్క రాష్ట్రాల నుంచి గుట్టుగా నాటుసారా ప్రవాహం.. పట్టుకున్న అధికారులు..
Sara Packets Seized: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను అదనుగా తీసుకున్న అక్రమార్కులు మద్యంప్రియులను పలు మార్గాల్లో దోచుకుంటున్నారు. మద్యం అధిక ధరలకు విక్రయించడం వరకే పరిమితమైన అక్రమార్కులు..
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను అదనుగా తీసుకున్న అక్రమార్కులు మద్యంప్రియులను పలు మార్గాల్లో దోచుకుంటున్నారు. మద్యం అధిక ధరలకు విక్రయించడం వరకే పరిమితమైన అక్రమార్కుల చర్యలు గుడుంబా అమ్మకాలతో బయటపడ్డాయి. గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా తయారీ, అమ్మకాలు జోరందుకుంటున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి గుట్టుగా సరిహద్దుతు దాటిస్తున్నారు అక్రమార్కులు. తాజాగా విజయనగరం జిల్లా పార్వతీపురం వద్ద ఎన్ఫోర్స్ మెంట్ అధిరులు భారీగా నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. జై భీమ్ కార్యకర్తలతో కలిసి స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు మాటు వేసి పట్టుకున్నారు
ఒడిస్సా రాష్ట్రం జగ్గుగూడ ప్రాంతం ఈ నాటు సారా ప్యాకెట్లు వస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు వారిని వలపన్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 6 వేల నాటుసారా పాకెట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 6 బైకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మద్యాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సిబ్బంది HC సింహాచలం, భూషణ రావు లు పాల్గొన్నారు.