AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Effect: కోవిడ్ కారణంగా మెదడుపై తీవ్ర ప్రభావం.. తాజా పరిశోధనలలో కీలక విషయాలు

Covid Effect: కోవిడ్-19 కారణంగా మనిషి మెదడు కుంచించుకుపోతుంది. UKలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford University) పరిశోధకులు తమ ఇటీవలి పరిశోధనలో ఈ విషయాన్ని..

Covid Effect: కోవిడ్ కారణంగా మెదడుపై తీవ్ర ప్రభావం.. తాజా పరిశోధనలలో కీలక విషయాలు
Subhash Goud
|

Updated on: Mar 22, 2022 | 1:49 PM

Share

Covid Effect: కోవిడ్-19 కారణంగా మనిషి మెదడు కుంచించుకుపోతుంది. UKలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford University) పరిశోధకులు తమ ఇటీవలి పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు. క‌రోనా వైర‌స్ సోకిన రోగుల‌లో మెదడు (Brain)పై ఈ ప్రభావం క‌నిపించింద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. కోవిడ్ (Covid 19) కారణంగా, రోగులలో కనిపించే ఈ ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. ఇన్ఫెక్షన్ కారణంగా మెదడు కుంచించుకుపోవడం వల్ల రోగిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోండి. కరోనావైరస్ మెదడుపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు 51 మరియు 81 సంవత్సరాల మధ్య వయస్సు గల 785 మంది మెదడులను పరిశీలించారు. మెదడు స్కాన్‌లకు ముందు లేదా మధ్య మళ్లీ కరోనా కలిగి ఉన్న 401 మంది రోగులు పరిశోధనలో పాల్గొన్నారు. కొవిడ్‌తో బాధపడుతున్న కొంతమంది రోగులలో మెదడు కుంచించుకుపోయినట్లు ఆధారాలు కూడా కనుగొనబడ్డాయి. కరోనా రోగుల్లో మెదడు కుచించుకుపోతున్న అంశాలు బ్రెయిన్ స్కాన్ నివేదికలో వెల్లడయ్యాయి. బ్రిటన్‌లో ఆల్ఫా వేరియంట్‌ల కేసులు వేగంగా పెరుగుతున్న సమయంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

మెదడు కుంచించుకుపోవడం వల్ల రోగులలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. రోగుల ఆలోచనా సామర్థ్యంలో క్షీణత ఉండవచ్చు. ఇది కాకుండా మెదడులోని భాగాన్ని ప్రభావితం చేయవచ్చు. న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. మెదడు దెబ్బతినడం వల్ల రోగి వాసన చూసే సామర్థ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మనిషి మెదడును కరోనా ఎంతవరకు దెబ్బతీస్తుందో పరిశోధనలు రుజువు చేశాయి.

ఇవి కూడా చదవండి:

Betel Leafs Benefits: మీకు తమలపాకు తినే అలవాటు ఉందా..? అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు..!

Child Care Tips: వేసవిలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లు తినిపించండి..!