AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Betel Leafs Benefits: మీకు తమలపాకు తినే అలవాటు ఉందా..? అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు..!

Betel Leafs: పెళ్లిళ్లలో, పూజలకు, వ్రతాలకు తమలపాకుకు ఓ ప్రత్యేక ఉంది. ఇది భారతీయ సంప్రదాయంలో ప్రత్యేకత కలిగి ఉంది. భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకోవడం అనాటి..

Betel Leafs Benefits: మీకు తమలపాకు తినే అలవాటు ఉందా..? అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు..!
Subhash Goud
|

Updated on: Mar 22, 2022 | 10:47 AM

Share

Betel Leafs: పెళ్లిళ్లలో, పూజలకు, వ్రతాలకు తమలపాకుకు ఓ ప్రత్యేక ఉంది. ఇది భారతీయ సంప్రదాయంలో ప్రత్యేకత కలిగి ఉంది. భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకోవడం అనాటి నుంచి అలవాటుగా వస్తోంది. ఒక ఆకులో సుమారు 85 నుంచి 90 శాతం వరకు నీరు, అధిక తేమ, కేటరీలు ఉంటాయి. సుమారు 100 గ్రాముల ఆకులు 44 కేలరీలు కలిగి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులో అయోడిన్‌, పొటాషియం, విటమిన్‌ ఎ , విటమిన్‌ బి1, బిటమిన్‌ బి2 ఉన్నాయి. ఈ తమలపాకు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఆకు వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) ఉన్నాయి. ఈ తమలపాకు రసం గాయాలకు ఎంతో ఉపయోగపడుతుంది.ఇది నొప్పిని కూడా నివారిస్తుంది. అలాగే బరువు తగ్గేందుకు ఉత్తమమైనది చెప్పవచ్చు. భోజనం తర్వాత తింటే కడుపులో గ్యాస్ట్రిక్‌ సమస్య (Gastric Problems) నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. తిన్న తర్వాత తమలపాకును తినడం అనాది నుంచి సంప్రదాయంగా కొనసాగుతోంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఈ ఆకు ఎంతగానో దోహదపడుతుంది. శ్లేష్మ పొరలను నివారించడానికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు నివారణకు ఉపయోగపడుతుంది. యాంటీ స్కీన్‌ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

అలాగే దంత క్షయాన్ని నివారిస్తుంది. నోటి దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారకం. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఈ ఆకు సహాయపడుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. ఈ ఆకును నమలడం వల్ల బ్యా్క్టీరియా పెరుగుదలను నిరోధిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మలేషియాలోని గ్రామీణ ప్రాంతాల్లో పురాతన కాలంలో మలేరియా నిరోధక ఔషధంగా ఈ ఆకులు ఉపయోగించబడుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి:

Morning: మార్నింగ్‌ లేవగానే ఈ పనులు చేయండి.. హుషారుగా ఉంటారు..!

Back Pain: వెన్నునొప్పి నుండి బయటపడటానికి ఈ ఆహారాలను తినండి