AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine: చైనాలో నాసిరకం వ్యాక్సిన్లు.. పెరుగుతున్న కేసులు.. ఆయా దేశాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు

Corona Vaccine: నాసిరకం ఉత్పత్తులను తయారు చేయడంలో నెంబర్‌ వన్‌గా ఉన్న చైనా.. చివరకు కరోనా వ్యాక్సిన్లను కూడా వదిలి పెట్టడం లేదు. వ్యాక్సిన్ల విషయంలో అలాంటి..

Corona Vaccine: చైనాలో నాసిరకం వ్యాక్సిన్లు.. పెరుగుతున్న కేసులు.. ఆయా దేశాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు
Corona Vaccine
Subhash Goud
|

Updated on: Jun 23, 2021 | 8:53 AM

Share

Corona Vaccine: నాసిరకం ఉత్పత్తులను తయారు చేయడంలో నెంబర్‌ వన్‌గా ఉన్న చైనా.. చివరకు కరోనా వ్యాక్సిన్లను కూడా వదిలి పెట్టడం లేదు. వ్యాక్సిన్ల విషయంలో అలాంటి పనే చేసినట్లు కనిపిస్తోంది. చాలా దేశాలు హడావుడిగా చైనా వ్యాక్సిన్‌ డోసులు కొనుగోలు తమ ప్రజలకు వేసేశాయి. ఇప్పుడా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఆ వ్యాక్సిన్లు పని చేయకపోవడం వల్లనని తెలిసింది. అయితే చైనా దేశంలో లక్షల మందికి ప్రయోగ దశలోనే ఉన్న కరోనా టీకాలను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ‘అత్యవసర వినియోగం’ పేరుతో ఇబ్బడిముబ్బడిగా వ్యాక్సిన్లు ఇచ్చాయి. చైనాలో పలు సంస్థలు కరోనాకు టీకాలను అభివృద్ధి చేస్తున్నాయి. ముప్పు అధికంగా ఉన్నవారికి ‘అత్యవసర అనుమతి’ కింద ఆ వ్యాక్సిన్లను ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం జనవరిలోనే అనుమతినిచ్చింది. కంపెనీలు మాత్రం లక్షల మందికి టీకాలు ఇచ్చేస్తున్నాయి. టీకాల భద్రత, సమర్థతను నిర్ధరించే ప్రయోగాలు ప్రారంభం కాకముందే తమ ఉద్యోగులు, పరిశోధకులకు టీకాలు ఇవ్వడం ద్వారా చైనా కంపెనీలు కలకలం సృష్టించాయి.

ఇప్పుడు చైనా వస్తువులే కాదు చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కూడా నాసిరకమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచానికి కరోనా వైరస్ అంటించిన చైనా ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలోనూ వాస్తవాలు వెల్లడించడం లేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. డ్రాగన్ కంట్రీకి అత్యంత మిత్ర దేశం అయిన పాకిస్తాన్‌ చైనా వ్యాక్సిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 60 ఏళ్లు పైబడిన వారిపై చైనా వ్యాక్సిన్ సినోఫార్మ్ సమర్థవంతంగా పని చేయడం లేదని వెల్లడించింది. వ్యాక్సిన్లు వేసుకున్నవారికి కరోనా సోకడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాసిరకం వ్యాక్సిన్లు ఇవ్వడం వల్లే మళ్లీ కరోనా విజృంభిస్తోందని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు సరిగ్గా పని చేయడం లేదని ఆయా దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, చైనాలోని వూహాన్‌లో వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు సైతం వ్యాపించింది. గత ఏడాది ఎందరో ప్రాణాలు కోల్పోగా, కోట్లాది మంది కరోనాతో పోరాడి బతికి బయట పడ్డారు. ప్రస్తుతం దేశంలో సెకండ్‌వేవ్‌ కొనసాగుతుండగా, ఇప్పుడు థర్డ్‌వేవ్‌ కూడా తీవ్ర స్థాయిలో విజృంభించే అవకాశాలున్నట్లు నిపుణులు ఇప్పటికే తెలియజేశారు. అయితే ఈ థర్డ్‌వేవ్‌లో పిల్లలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పని చేస్తున్నాయి. ఒక వైపు వ్యాక్సినేషన్‌, మరో వైపు లాక్‌డౌన్‌ ఆంక్షలు కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కరోనా కట్టడికి భారత్‌ కఠిన చర్యలు తీసుకోవడంతో కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో పలు రాష్ట్రాలు అన్‌లాక్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Vaccination: మనకు అందుబాటులో ఉన్న కరోనా టీకాలు ఏ పద్ధతుల్లో తయారు అవుతున్నాయి? అవి ఏ రకంగా పనిచేస్తాయి?

Vaccination: బ్రిటన్ లో టీకా కోసం ఉత్సాహం చూపిస్తున్న యువత..వ్యాక్సిన్ కేంద్రాల ముందు బారులు!