Vaccination: బ్రిటన్ లో టీకా కోసం ఉత్సాహం చూపిస్తున్న యువత..వ్యాక్సిన్ కేంద్రాల ముందు బారులు!

Vaccination: పెరుగుతున్న కరోనా కేసుల మధ్య బ్రిటన్లో నిదానమైన టీకాల కార్యక్రమానికి యువత బూస్టర్ ఇచ్చారు. బ్రిటన్ దేశ జనాభాలో 46.6% మందికి ఇప్పటికే టీకాలు వేశారు.

Vaccination: బ్రిటన్ లో టీకా కోసం ఉత్సాహం చూపిస్తున్న యువత..వ్యాక్సిన్ కేంద్రాల ముందు బారులు!
Vaccination In Britain
Follow us

|

Updated on: Jun 21, 2021 | 5:26 PM

Vaccination: పెరుగుతున్న కరోనా కేసుల మధ్య బ్రిటన్లో నిదానమైన టీకాల కార్యక్రమానికి యువత బూస్టర్ ఇచ్చారు. బ్రిటన్ దేశ జనాభాలో 46.6% మందికి ఇప్పటికే టీకాలు వేశారు. ఇప్పుడు 18-20 సంవత్సరాల మధ్య వయసు వారికి టీకా కార్యక్రమం ప్రారంభించారు. వ్యాక్సినేషన్ కోసం ఇక్కడ యువత పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో టీకా కేంద్రాల వెలుపల పొడవైన క్యూలు ఉన్నాయి. కార్యక్రమం మొదటి రోజు ఈ వయసువారు 7.30 లక్షల మంది తమ స్లాట్ బుక్ చేసుకున్నారు. ప్రతి గంటకు 30 వేల మందికి వ్యాక్సిన్లు ఇస్తూ వస్తున్నారు. దాదాపుగా ఒక కిలోమీటర్ల పొడవైన క్యూలో నిలబడి యువకులు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసుకుంటే స్వేచ్ఛగా ఉండవచ్చని ఈ క్యూ లైన్‌లోని యువత చూస్తున్నారు. టీకాలు వేసిన తరువాత వారు నిర్బంధంగా గడపాల్సిన అవసరం లేదని నమ్మకంగా ఉన్నారు. టీకా తీసుకుంటే ఎక్కడైనా తిరగడానికి ఇబ్బంది ఉండదని, అందుకే టీకా వేసుకోవడానికి ఉత్సాహంగా వచ్చామని క్యూ లైన్ లో ఉన్న యువకులు చెప్పడం గమనార్హం. గత మూడు రోజులుగా బ్రిటన్‌లో 10 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ. శనివారం దేశంలో 14 మరణాలు నమోదయ్యాయి.

మరోవైపు, ఫైజర్, మోడెర్నా మరియు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల కొరత కారణంగా, గత వారం యుకెలో 4.5 లక్షల టీకాలు మాత్రమే ఇచ్చారు. టీకా అందుబాటులో ఉన్నపుడు వారానికి 1.2 మిలియన్ వ్యాక్సిన్లు ఇస్తూ వస్తున్నారు. జూన్ 18 వరకు యూకేలో 73 మిలియన్ మోతాదులను అందించారు. వీరిలో, 4.2 కోట్ల జనాభాకు మొదటి మోతాదు అందింది. 3.11 కోట్ల (46.6%)మందికి రెండు మొతాడులూ అందాయి. టీకా కార్యక్రమం బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ ఇచ్చింది. ఇప్పుడు అది ఊహించిన దానికంటే వేగంగా పెరుగుతోంది. పెద్ద ఎత్తున టీకాలు వేయడానికి లండన్ క్లబ్ చెల్సియా మరియు టోటెన్హామ్ ఫుట్‌బాల్ స్టేడియాలో టీకాలు వేస్తున్నారు. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ప్రకారం, యువ జనాభాలో డెల్టా వేరియంట్ కేసులు వారంలో 79% పెరిగాయి.

ఆర్థిక వ్యవస్థ వృద్ధి..

యుకె ఇండస్ట్రీ అసోసియేషన్ తాజా అంచనా ప్రకారం, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ డిసెంబర్ నాటికి లాక్డౌన్కు ముందు ఉన్న స్థితికి చేరుకుంటుంది. యూనియన్ ఈ సంవత్సరం వృద్ధి అంచనాను 6% నుండి 8.2% కు తగ్గించింది. 2022 లో కూడా వృద్ధి రేటు 5.2 నుండి 6.1% వరకు అంచనా వేశారు. IMF 5.1% అంచనా వేసింది. అందువల్ల ఈ పెరుగుదల ఊహించిన దాని కంటే బాగుంది.

Also Read: చైనాలో వెల్లువెత్తిన వ్యాక్సిన్ డ్రైవ్……..100 కోట్ల డోసులతో ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో డ్రాగన్ కంట్రీ

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆ ముగ్గురు చైనా వ్యోమగాములకు రోజూ ‘పండగే ‘ ! వారు ఏం తింటారంటే …?

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు