చైనాలో వెల్లువెత్తిన వ్యాక్సిన్ డ్రైవ్……..100 కోట్ల డోసులతో ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో డ్రాగన్ కంట్రీ

చైనాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వెల్లువెత్తింది. తమ దేశ ప్రజలకు 100 కోట్ల డోసుల కు పైగా టీకామందులు ఇచ్చి ప్రపంచంలోనే అతి పెద్ద ఇనాక్యులేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన దేశంగా పాపులర్ అయింది.

చైనాలో వెల్లువెత్తిన వ్యాక్సిన్  డ్రైవ్........100 కోట్ల డోసులతో ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో డ్రాగన్ కంట్రీ
China Administered More Tha
Umakanth Rao

| Edited By: Phani CH

Jun 21, 2021 | 3:00 PM

చైనాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వెల్లువెత్తింది. తమ దేశ ప్రజలకు 100 కోట్ల డోసుల కు పైగా టీకామందులు ఇచ్చి ప్రపంచంలోనే అతి పెద్ద ఇనాక్యులేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన దేశంగా పాపులర్ అయింది. ఈ నెల 19 నాటికి చైనా..1,010,489,000 డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్టు అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. శనివారంతో అంతమైన ఆరు రోజుల వ్యవధిలోనే 10 కోట్ల డోసుల పైగా వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఈ సంస్థ పేర్కొంది. అయితే ప్రజల్లో ఎంతమంది రెండు డోసులు తీసుకున్నారో.. ఎంతమంది ఒకే డోసు తీసుకున్నారో తెలియలేదు. జూన్ నెలాఖరుకు దేశ జనాభాలో 40 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ఉందని చైనా ఆరోగ్య నిపుణుడు జాంగ్ నన్షాన్ గత మార్చిలో తెలిపాడు. ఇటీవల మళ్ళీ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగగానే అధికారులు వీటి కట్టడికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కేవలం 25 రోజుల్లో 100 మిలియన్ డోసుల నుంచి 200 మిలియన్ డోసులను ఇచ్చినట్టు హెల్త్ కమిషన్ వెల్లడించింది.

ఆరు రోజుల్లోనే 800 మిలియన్ డోసుల నుంచి 900 మిలియన్ డోసులను ఇవ్వగలిగామని, ప్రజలు కూడా ఉత్సాహంగా ఈ వ్యాక్సినేషన్ కేంద్రాలకు వస్తున్నారని ఈ సంస్థ పేర్కొంది. డెల్టా వేరియంట్ కారణంగా కేసుల సంఖ్య పెరిగిన మాట నిజమేనని, కానీ సామూహిక టెస్టింగులను పెంచడం, ఎక్కడికక్కడ లోకల్ లాక్ డౌన్ల విధింపు వంటి చర్యలతో సాధ్యమైనంతవరకు చాలావరకు వీటిని అదుపు చేయగలిగారు. సైకోఫామ్ వ్యాక్సిన్ ని, సైనోవాక్ టీకామందును కూడా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించింది. వీటిని చైనా వివిధ దేశాలకు సరఫరా చేసింది. వీటిలో చిలీ వంటి దేశాలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: ఢిల్లీలోని షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం…..ఆరుగురు ఉద్యోగుల గల్లంతు…… ఇంకా ముమ్మర సహాయ చర్యలు

CBSE Exam: ఇంట‌ర్న‌ల్ మార్కులు న‌చ్చ‌ని సీబీఎస్ఈ విద్యార్థుల‌కు పరీక్ష‌లు.. ఆగ‌స్టులో నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu