Online Marriage: ఆంధ్రా అబ్బాయి.. తెలంగాణ అమ్మాయి.. తల్లిదండ్రులు ఇండియాలో.. పెళ్లి మాత్రం అమెరికాలో.. ఎందుకంటే..?
ఆంధ్రా అబ్బాయి.. తెలంగాణ అమ్మాయి.. అయితే పెళ్లి మాత్రం అమెరికా జరిగింది. పేరెంట్స్ ఒప్పుకున్నా, వారు లేకుండానే పెళ్లి జరిగిపోయింది.
Online Marriage in America: అమ్మాయి, అబ్బాయి ఇష్టపడ్డారు.. ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు.. ఒకే దగ్గర చదువుకోవడంతో వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసింది. దీంతో రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు.. పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. అయితే, పేరెంట్స్ అంగీకరించినా, వారు లేకుండానే పెళ్లి జరిగిపోయింది.
ప్రపంచంలోని అందరి జీవితాలను కరోనా పూర్తిగా మార్చేసింది. ప్రజల జీవన విధానాలు కూడా మారిపోయేలా చేసింది. కరోనాతో వివాహాలు ఆడంబరంగా జరుపుకునే పరిస్థితి లేకుండా పోయింది. వందలాది మంది సమక్షంలో వివాహం జరుపుకోవాలనే వధూవరుల కలలు నెరవేరడం లేదు. తాజాగా అమెరికాలో ఓ పెళ్లి అలాగే జరిగింది.
నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన కొత్తపల్లి కృష్ణారావు, వాణిశ్రీల కుమార్తె తనూజ, గుంటూరుకు చెందిన రవి, పద్మల కుమారుడు కృష్ణతేజ అమెరికాలో MS చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అటు, ఇరువురి కుటుంబాలకు చెందిన పెద్దలు కూడా వీరి పెళ్లికి అంగీకరించారు. దీంతో పెళ్లికి ముహూర్తం ఖరారైంది. ఘనంగా పెళ్లి చేయాలని రెండు కుటుంబాలు భావించాయి.
అయితే, కరోనా కారణంగా వారిద్దరు భారత్‌కు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో అమెరికాలోనే మూడు ముళ్లు వేయాల్సి వచ్చింది. తనూజ, కృష్ణతేజల పెళ్లికి ఇరు వర్గాల పెద్దలు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు. కేవలం ఆన్‌లైన్‌లోనే వీరి పెళ్లిని వీక్షించి, ఆశీర్వదించారు. అమెరికాలో పెళ్లి జరుగుతున్న సమయంలో అక్కడ గుంటూరులో అబ్బాయి కుటుంబీకులు, ఇక్కడ నిజామాబాద్‌లో అమ్మాయి తరఫు కుటుంబీకులు, బంధువులు LED స్క్రీన్లపై వివాహాన్ని వీక్షించారు. కరోనా తీవ్రతతో వధూవరులు ఇక్కడి రావడం కుదరలేదని, దీంతో ముహూర్త సమయానికి అక్కడే మూడు ముళ్లే వేశారని అమ్మాయి కుటుంబీకులు తెలిపారు.
Read Also… Caste Deportation in Jagityal: జగిత్యాల జిల్లాలో దారుణం.. కుల బహిష్కరణ పేరుతో ఓ కుటుంబంపై దాడి