Meet SpaceBok: మార్స్‌పైకి నాలుగు కాళ్ల రోబో.. అసలు ఇది ఏం చేస్తుందో తెలుసా.?

విశ్వంలో భూమిపై కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందా..? అన్నదానిపై చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్టులు. సౌర కుటుంబంలోని..

Meet SpaceBok: మార్స్‌పైకి నాలుగు కాళ్ల రోబో.. అసలు ఇది ఏం చేస్తుందో తెలుసా.?
Spacebok
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 21, 2021 | 4:52 PM

విశ్వంలో భూమిపై కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందా..? అన్నదానిపై చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్టులు. సౌర కుటుంబంలోని వివిధ గ్రహాల మీదకు శాటిలైట్లను పంపుతున్నారు. మార్స్‌ గ్రహంపైకి రోబోను పంపి, దాని ద్వారా పరిశోధనలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ చాలా వరకు అది సక్సెస్‌ కాలేకపోయింది. ఇక తాజాగా నాలుగు కాళ్లతో నడిచే ఓ రోబోను మార్స్‌పైకి పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సైంటిస్టులు.

ఇప్పటికే అంగారకుడిపైకి పంపించిన రోవర్లుగా అంతాగా సక్సెస్‌ కాలేకపోయాయి. గ్రహాలపై రోవర్లు ప్రయాణించే సమయంలో రాళ్లు, రప్పలు, ఇసుక వంటి వాటి మధ్యలో రోబోలు ప్రయాణించలేక తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. 2006, 2009 సంవత్సరంలో పంపించినా రోబోలు రాళ్లు, ఇసుకలో చిక్కుకుపోయాయి. దీంతో ఆ పరిశోధనలు మధ్యలోనే ఆపేశారు సైటింస్టులు. అయితే ప్రస్తుతం మార్స్‌పై నాసాకు చెందిన క్యూరియాసిటీ, పర్సవరెన్స్‌రోవర్లు, చైనాకు చెందిన ఝరోంగ్‌ రోవర్‌ పరిశోధనలు చేస్తున్నాయి.

భూమి మీద నుంచి మార్స్‌పైకి వెళ్లి, సక్సెస్‌ ఫుల్‌గా పని పూర్తి చేసే ఓ గొప్ప రోబోను రూపొందించారు సైంటిస్టులు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈటీహెచ్‌జ్యూరిచ్, జర్మనీకి చెందిన మాక్స్‌ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తల బృందం ఈ స్పేస్‌బాక్‌ పేరుతో నాలుగు కాళ్లతో నడిచే ప్రత్యేకమైన రోబోను రూపొందించారు. ఎత్తు పల్లాలు, ఇసుక, రాళ్లపైన సులువుగా నడిచేలా ఈ రోబోను రూపొందించారు సైంటిస్టులు. ఇప్పటికే ఈ స్పేస్‌బాక్‌ రోబోను ల్యాబ్‌లో పరీక్షించగా.. సులువుగా నడవగలిగింది. అయితే ఈ రోబో రోవర్లకు ప్రత్యామ్నాయం కాదని.. రోవర్లకు వీలుకాని చోట్లకు వెళ్లి పరిశోధన చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read:

వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..

ఈ ఫోటోలో పులి దాగుంది.! మీరు కనిపెట్టగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!

నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!