Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: ఫ్రాన్స్‌లో మళ్ళీ కరోనా వైరస్ కల్లోలం..ప్రపంచవ్యాప్తం రోజువారీ అత్యధిక కేసులు నమోదు..

Coronavirus in France: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ఈ మహమ్మారి  ఐరోపా దేశాల్లో రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఫ్రాన్స్‌లో గత 24 గంటల్లో..,

Coronavirus: ఫ్రాన్స్‌లో మళ్ళీ కరోనా వైరస్ కల్లోలం..ప్రపంచవ్యాప్తం రోజువారీ అత్యధిక కేసులు నమోదు..
Coronavirus In France
Follow us
Surya Kala

|

Updated on: Dec 29, 2021 | 6:10 PM

Coronavirus in France: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ఈ మహమ్మారి  ఐరోపా దేశాల్లో రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఫ్రాన్స్‌లో గత 24 గంటల్లో 1,79,807 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా నమోదైన అత్యధిక రోజువారీ కేసుల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు ఐరోపా ఖండంలో అత్యధిక కొత్త రోజువారీ కేసులు. గత రెండు రోజులుగా, ఫ్రాన్స్‌లో రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  దీంతో ఫ్రాన్స్‌లో మరోసారి కరోనా వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అంతకుముందు.. గత వారం శనివారం రికార్డు స్థాయిలో 1,04,611 కేసులు నమోదయ్యాయి. ఇది నవంబర్ 11, 2020 తర్వాత అత్యధికం.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా  ప్రాన్స్ ప్రభుత్వం కొత్త ఆంక్షలను అమలు చేయడం ప్రారంభించింది.  సమావేశాల్లో పాల్గొనే వారి సంఖ్య పరిమితం చేయడంతో పాటు, రవాణా వ్యవస్థ, మాస్కులు ధరించడం వంటి వాటిపై ఆంక్షలు విధించింది.  అయితే కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నా.. ఆసుపత్రిలో కోవిడ్ సోకిన రోగుల సంఖ్య పరిమితంగా ఉండడం విశేషం. ప్రజలు వ్యాక్సిన్  తీసుకోవడం వలన వ్యాధి తీవ్రత తగ్గిందని.. ఆస్పత్రిలో చేరే కేసుల సంఖ్య తగ్గిందని వైద్య అధికారులు భావిస్తున్నారు.

ప్రాన్స్ లో 77 శాతం మందికి వ్యాక్సిన్: 

ఇక దేశంలో గత 24గంటల్లో కోవిడ్ కారణంగా 290 మంది మరణించారని ఫ్రాన్స్  అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా వలన ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,23,000కు చేరుకుంది. మే తర్వాత ఒక్కరోజులో సంభవించిన అత్యధిక మరణాల సంఖ్య ఇదే. ఫ్రెంచ్ జనాభాలో 77 శాతం మంది పూర్తిగా టీకాలు వేయబడ్డారు. దీంతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య బాగా తగ్గింది. అదే సమయంలో, ఒమిక్రాన్ వేరియంట్ విధ్వంసం ప్రపంచవ్యాప్తంగా మోడలింది. ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో అనేక దేశాలలో కొత్త కేసులు పెరిగాయి.

కొత్త వేరియంట్ పై ప్రపంచంలో ఆందోళన: 

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడి పెంచుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది.  అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలు కఠినమైన చర్యలు తీసుకోవలసి అవసరం ఏర్పడింది. అయితే మళ్లీ ఆంక్షలు అమలు చేస్తే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది. అయితే ఇప్పటికే కొన్ని దేశాలు ఆంక్షలు విధించడం ప్రారంభించాయి.

Also Read:   చెన్నై మెట్రో రైళ్లలో ఇద్దరు యువకులు ఎఆర్ రెహ్మాన్ సాంగ్‌తో సందడి.. తోటి ప్రయాణీకులు ఫిదా..