Watch Video: పార్లమెంట్‌లో రచ్చ రచ్చ.. ఒకరినొకరు కొట్టుకున్న జోర్డాన్ ఎంపీలు.. షాకింగ్ వీడియో
Jordanian MPs exchange punches: అదోక పార్లమెంట్.. సహజంగా ప్రభుత్వ, విపక్ష సభ్యుల మధ్య పరస్పర విమర్శలు సర్వసాధారణం.. ఈ క్రమంలో ఆందోళనలు, ఆరోపణలు, వాగ్వాదాలు
Jordan parliament: అదోక పార్లమెంట్.. సహజంగా ప్రభుత్వ, విపక్ష సభ్యుల మధ్య పరస్పర విమర్శలు సర్వసాధారణం.. ఈ క్రమంలో ఆందోళనలు, ఆరోపణలు, వాగ్వాదాలు పరిపాటి.. అయితే.. ఒక్కొసారి హుందాగా వ్యవహరించాల్సిన సభలో కొందరు విచక్షణ కొల్పోయి ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఘటనే జోర్డాన్ పార్లమెంట్‌లో చోటుచేసుకుంది. హుందాగా ఉండే ఎంపీలు.. ఒక్కసారిగా బాహాబాహికి దిగారు. విచక్షణ కోల్పోయి గల్లాలు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ సంఘటన పెనుదుమారం రేపింది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీలే ఇలా పిడిగుద్దుల వర్షం కురిపించుకుంటే ఎలా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవల జోర్డాన్ పార్లమెంటులో రాజ్యాంగ సంస్కరణల గురించి చర్చ సందర్భంగా ఈ ఘటన జరిగింది. దేశ రాజ్యాంగ సవరణలకు సంబంధించిన అంశాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంపీలు ఒకరినొకరు కొట్టుకుంటూ, దూషించుకుంటూ కనిపించారు. జోర్డానియన్ల విధులు, హక్కులపై రాజ్యాంగ సవరణ కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగింది. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ ఈ సవరణను తప్పుపట్టారు. ఈ బిల్లు పనికిరాదంటూ అధికార పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార పార్టీ ఎంపీల ప్రతి విమర్శలకు దిగారు. సదరు ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Several deputies traded punches in a brawl in Jordan’s parliament after a verbal row escalated when the assembly speaker called on a deputy to leave, witnesses said https://t.co/4WVq2L1Div pic.twitter.com/RqA04SZHeY
— Reuters (@Reuters) December 28, 2021
దీంతో రెండు వర్గాల ఎంపీల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ ఘటన డిసెంబర్ 28న జరిగిన పార్లమెంట్ సెషన్‌లో జరిగింది. డైలీ మెయిల్ కథనం ప్రకారం.. పార్లమెంట్ హౌస్ స్పీకర్ అబ్దుల్ కరీం దుగ్మీ, డిప్యూటీ సులేమాన్ అబు యాహ్యా మధ్య వాగ్వాదం జరిగింది. అయితే.. ఘర్షణలో ఎవరూ గాయపడలేదని పేర్కొంటున్నారు.
జోర్డాన్ రాజ్యాంగంలోని పౌరులందరికీ సమాన హక్కులకు హామీ ఇచ్చే చట్టంలో ప్రత్యేకంగా మహిళల పేరును జోడించడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఇది లింగ వివక్షకు దారి తీస్తుందని.. ఈ ముసాయిదా సవరణను నిలిపివేయాలని సూచిస్తున్నారు. ఈ చర్చ సందర్భంగా ఎంపీలు చొక్కాలు పట్టుకొని ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారని అధికారవర్గాలు తెలిపాయి.
Also Read: