Cockroach Bear: బొద్దింకలతో బీర్.. ఎంతో రుచి అంటూ గుటగుటా తాగేస్తున్న ఆ దేశ ప్రజలు..
Cockroach bear: రోజు రోజుకీ ప్రపంచ వ్యాప్తంగా పెరుగున్న జనాభా... పెరుగున్న జనాభాకు అనుగుణంగా ఆహారపంటలు పెరగడం లేదు.. రానున్న కొన్ని ఏళ్ళల్లో ఆహార..
Cockroach Bear: రోజు రోజుకీ ప్రపంచ వ్యాప్తంగా పెరుగున్న జనాభా… పెరుగున్న జనాభాకు అనుగుణంగా ఆహారపంటలు పెరగడం లేదు.. రానున్న కొన్ని ఏళ్ళల్లో ఆహార సంక్షోభం తలెత్తనున్నదని.. ఇతర ఆహారపు అలవాట్లు చేసుకోవాలని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ముంచుకొస్తున్న ఆహార సంక్షోభాన్ని గట్టెంక్కించేవి కీటకాలు అంటూ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ కీటకాలను చైనా, థాయిలాండ్ వంటి దేశాలు ఎప్పటినుంచో తమ ఆహారంగా తీసుకుంటున్నారు. మన దేశంలో కూడా కొన్ని ఆదివాసీ తెగలు చీమలు వంటి కీటకాలను ఆహారంగా తింటారు. . 2023 చివరి నాటికి తినదగిన కీటకాల ప్రపంచ మార్కెట్ 2 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా. అయితే ఇప్పటికే అనేక దేశాల్లో పురుగులు వంటకాలు చేసే స్టార్ హోటల్స్ , ప్రత్యేక ఫుడ్ వింగ్స్ ఏర్పడుతున్నాయి. ఆ పురుగులను ఎంతో ఇష్టంగా తింటూ తమ ఫుడ్ మెనూలో ఓ ప్రధాన వంటకంగా చేర్చేశారు కూడా.. అయితే ఇప్పుడు బొద్దింకలు నుంచి బీరుని తయారు చేస్తున్నారు. అంతేకాదు ఈ బీరుని తాగడం కోసం జనం ఓ రేంజ్ లో ఆసక్తిని చూపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
తాజాగా జపాన్‌లో బొద్దింకలు బీర్ పై అక్కడ ప్రజలు మోజుపడుతున్నారు. జపాన్ ప్రజలు తైవానీ బగ్‌తో తయారు చేసిన బీర్‌ను ఎంతో ఉత్సాహంతో తాగుతున్నారు. ఈ బీరు కొంచెం పులుపుగా ఉండి ఎంతో రుచిగా ఉంటుందంటూ లొట్టలేసుకుంటూ మరీ బాటిల్స్ కు బాటిల్స్ తాగేస్తున్నారు. దీంతో ఇప్పుడు అక్క్కడ బొద్దింకలతో తయారు చేసిన ఈ బీర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
అయితే నిజానికి ఇవి మన ఇంట్లో దొరికే బొద్దింకలు కాదు..జపాన్ లో ఉండే బొద్దింకలు ఇవి నీటిలో నివసిస్తాయి. పూర్తిగా మాంసాహారులు. చూడడానికి మన ఇంట్లో చూసే బొద్దింకల్లానే ఉంటాయి. వీటిద్వారా ప్రస్తుతం బీరు తయారు చేస్తున్నారు. అక్కడ వారు దీనిని కొంచు సౌర్ అని పిలుస్తున్నారు. కూల్ డ్రింక్ లాగా.. తాగడానికి వీలుంటుంది.
బీరుని తయారు చేస్తున్న పురుగులను ఇండియన్ టాయ్ బైటర్ అంటారు. వీటి పొడవు 4 అంగుళాలు ఉంటుంది. మంచినీటిలో పెరుగుతాయి. నీటిలో జీవించే ఇతర పురుగులను, చిన్న చిన్న చేపలను, కీటకాలతో పాటు.. మంచి చేతి వేళ్ళు, కాలి వేళ్ళని అతి ఇష్టంగా తింటాయి. ఈ పురుగు దక్షిణ ఆగ్నేయాసియాలో రుచికరమైన కీటకంగా ప్రసిద్ధిగాంచింది. ఇవి లైట్ల ద్వారా ఆకర్షితులవుతాయి.
అందుకనే ఈ పురుగులను పట్టుకోవడానికి జపాన్ ప్రజలు ప్రత్యేక లైట్స్ ను ఉపయోగిస్తారు. ఆ లైట్స్ వెలుతురుకి అవి వాటి దగ్గరకు వస్తాయి. అలా దగ్గరకు వచ్చిన వాటిని వెంటనే చాకచక్యంగా పట్టుకుంటారు.
అనంతరం ఈ కీటకాలను వేడి నీటిలో ఉడకబెడతారు. అనంతరం వాటిని కుళ్లబెట్టి.. మూడు నాలుగు రోజుల తర్వాత దాని రసం తీసి తాగుతారు. ఈ పురుగుల బీర్ రుచి పులుపు, తియ్యదనం కలిపి ఓ పండులా ఉంటుందని ప్రజలు అంటున్నారు. జపాన్‌లో, ఈ కీటకాన్ని చాలా సూప్‌లలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ పురుగుల పెంపకం కూడా చేపట్టారు. పెద్ద కంపెనీలు ఈ పురుగును పెంచి బీరుని తయారు చేస్తూ.. లాభాలు ఆర్జిస్తున్నాయి. ఈ బీర్ చల్లగా వడ్డిస్తారు. దీని ధర గురించి చెప్పాలంటే రూ.450కి బాటిల్ లభిస్తుంది. ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.
ఇక తైవాన్‌లో ఈ బొద్దింకల్లో మగ పురుగులను తినడానికి ఇష్టపడతారు. ఈ కీటకాలు తియ్యగా ఉంటాయట. వాటిని తింటే… దాదాపు ఓ తియ్యని పండును తిన్నట్టే ఉంటుందట. రుచి, వాసన అచ్చం రొయ్య రుచి లాగే ఉంటుందట. అందుకనే తైవానీలు ఈ బొద్దింకలను ఉడకబెట్టి తింటారు. లేదా… సూప్ చేసి తాగుతారు.