Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: చైనా ల్యాబ్‌లోనే కరోనా జననం.. మరెన్నో జీవాయుధాలున్నాయంటూ ఎఫ్‌బీఐ చీఫ్‌ సంచలన ఆరోపణలు

అంటువ్యాధి ఒక శక్తివంతమైన ప్రయోగశాలలో పుట్టినట్లు FBI కొంతకాలం క్రితమే అంచనా వేసిందని చెప్పారు."  చైనా వుహాన్ లో 2019న కరోనావైరస్ ఎలా వ్యాప్తి చెందిందనే విషయంపై FBI రహస్య పరిశోధనలు చేసిందని.. ఇప్పుడు మొదటి సారిగా బహిరంగంగా నిర్ధారణ చేసినట్లు చెప్పారు. 

Covid 19: చైనా ల్యాబ్‌లోనే కరోనా జననం.. మరెన్నో జీవాయుధాలున్నాయంటూ ఎఫ్‌బీఐ చీఫ్‌ సంచలన ఆరోపణలు
China In Covid 19
Follow us
Surya Kala

|

Updated on: Mar 02, 2023 | 2:04 PM

మిలియన్ల మందిని చంపిన కరోనా వైరస్ ఎలా పుట్టింది అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా నిరంతరం కలుగుతూనే ఉంది. ఈ వైరస్ ఎప్పుడు, ఎలా పుట్టింది అన్న ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే తాజాగా FBI డైరెక్టర్ క్రిస్టోఫర్ రే  కరోనా వైరస్ విషయంపై బీజింగ్ వేదికగా స్పందించారు. ప్రాణాంతకమైన కోవిడ్ -19 మహమ్మారి వుహాన్‌లోని చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రయోగశాల నుండి ఉద్భవించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తమ ఏజెన్సీ విశ్వసిస్తోందన్నారు. క్రిస్టోఫర్ వ్రే ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు.. అంటువ్యాధి ఒక శక్తివంతమైన ప్రయోగశాలలో పుట్టినట్లు FBI కొంతకాలం క్రితమే అంచనా వేసిందని చెప్పారు.”  చైనా వుహాన్ లో 2019న కరోనావైరస్ ఎలా వ్యాప్తి చెందిందనే విషయంపై FBI రహస్య పరిశోధనలు చేసిందని.. ఇప్పుడు మొదటి సారిగా బహిరంగంగా నిర్ధారణ చేసినట్లు చెప్పారు.

సమస్యను రాజకీయం చేయడం: చైనా FBI డైరెక్టర్ క్రిస్టోఫర్ రే  కరోనా వైరస్ పై చేసిన ప్రకటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. వైరస్  మూలాన్ని కనుగొనే అంశంపై రాజకీయాలకు తావివ్వడం చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. “సైన్స్ విషయంలో ఇంటెలిజెన్స్ విభాగం ఎంట్రీ ఇచ్చే విధంగా చేయడంతో కరోనా సమస్యను రాజకీయం చేయాలనీ చూస్తున్నట్లు స్పష్టం అవుతుందని ఆయన  బీజింగ్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతేకాదు US ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ కల్పిత కథ ట్రాక్ రికార్డ్‌ను బట్టి ప్రామాణికత ఏదీ పక్కగా లేదన్నారు”

ల్యాబ్ లీక్ కథనాన్ని ప్రసారం చేయడం ద్వారా చైనా పరువు తీసే ప్రయత్నంలో అమెరికా విజయం సాధించదని.. తన ప్రతిష్టను తానే తీసుకుంటుందని మావో అన్నారు. “శాస్త్రాన్ని, వాస్తవాలను గౌరవించాలని.. ఈ సమస్యను రాజకీయం చేయడం మానేయాలని తాము  యుఎస్‌ని కోరుతున్నాము” అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

చైనా అడ్డుపడుతోంది: ఎఫ్‌బీఐ చీఫ్‌ కొన్ని రోజుల క్రితం..  కొవిడ్-19 బహుశా చైనాలోని ఒక ప్రయోగశాలలో లీక్ అయినట్లు.. అక్కడ నుంచి కోవిడ్ ఉద్భవించిందని అని వార్తలు వచ్చాయి. వుహాన్‌ నగరంలోని సీఫుడ్, వన్యప్రాణుల మార్కెట్‌లో జంతువుల నుండి మానవులకు వైరస్ వ్యాపించిందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ మార్కెట్ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి సమీపంలో ఉంది.

గ్లోబల్ మహమ్మారి మూలాన్ని కనుగొనే ప్రయత్నాలను విధ్వంసం చేయడానికి చైనా సాధ్యమైన ప్రయత్నాలు చేస్తుందని ఎఫ్‌బిఐ చీఫ్ మంగళవారం ప్రసారం చేసిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు “చైనీస్ ప్రభుత్వం తమ పనిని నిరోధించడానికి చాలా  ప్రయత్నిస్తోందని.. అది దురదృష్టకరం అంటూ వ్యాఖ్యానించారు. ”

“COVID వంటి కొత్త వైరస్‌లతో సహా జీవసంబంధమైన అనేక వైరస్ లు సృష్టించే వారు అనేకమంది ఉన్నారని..  FBI గుర్తించింది. అంతేకాదు అవి చెడ్డ వ్యక్తి, శత్రు దేశం, ఉగ్రవాది, నేరస్థుల చెడ్డ చేతుల్లోకి చేరుతాయేమోనన్న ఆందోళన కలుగుతుందని రే చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..