Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Study MBBS Abroad: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. నీట్‌ ర్యాంక్‌ ద్వారా విదేశాల్లో కూడా MBBSలో అడ్మిషన్లు పొందవచ్చు

నీట్‌ యూజీ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్) - 2023 పరీక్ష మే 7న జరగనున్న విషయం తెలిసిందే. నీట్‌ యూజీలో సాధించిన స్కోర్‌ ఆధారంగా దేశంలోని పలు మెడికల్‌ కాలేజీల్లో..

Study MBBS Abroad: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. నీట్‌ ర్యాంక్‌ ద్వారా విదేశాల్లో కూడా MBBSలో అడ్మిషన్లు పొందవచ్చు
Study MBBS from abroad
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 04, 2023 | 1:33 PM

నీట్‌ యూజీ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్) – 2023 పరీక్ష మే 7న జరగనున్న విషయం తెలిసిందే. నీట్‌ యూజీలో సాధించిన స్కోర్‌ ఆధారంగా దేశంలోని పలు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఐతే అది అంత సులువుకాదు. కోచింగ్‌ సెంటర్లలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడమో, లేక నిద్రాహారాలుమాని కష్టపడి చదివితేనో మంచి ర్యాంక్‌ వస్తుంది. అలా ర్యాంకు వచ్చిన తర్వాత కూడా కోరుకున్న కాలేజీలో మెడికల్ సీటు దొరుకడం గగనమైపోతుంది. కటాఫ్‌ ర్యాంకు సాధించకపోతే మెడిసిన్‌ చదవాలనే కోరిక కలగానే మిగిలిపోతుందనుకునే వారందరికీ గుడ్‌న్యూస్‌. మన దేశంలో నిర్వహించే నీట్‌ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా విదేశాల్లోని అత్యంత అధునాతన మెడికల్‌ యూనివర్సిటీల్లో కూడా సీట్లు పొందవచ్చని చాలా మందికి తెలియదు. నీట్‌ ర్యాంక్‌ ఆధారంగా ఏయే దేశాలు ప్రవేశాలు కల్పిస్తాయంటే..

రష్యా..

రష్యాలో భారత్‌ నుంచి 2022 సంవత్సరంలో దాదాపు 18,039ల మంది మెడికల్‌ విద్యార్ధులు ప్రవేశాలు పొందారు. 2021లో 4,515 మంది భారతీయ విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE)కి హాజరవ్వగా 1,119 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. అంతేకాకుండా రష్యాలోని అనేక వర్సిటీలలో ఎంబీబీఎస్‌ ప్రవేశాలు పొందాలంటే నీట్‌ ర్యాంక్‌ను (50 శాతం) పరిగణనలోకి తీసుకుంటాయి. ‘స్టడీ ఇన్ రష్యా’ వెబ్‌సైట్ ప్రకారం.. రష్యాలో దాదాపు 70 యూనివర్సిటీలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఖజకిస్థాన్‌

2021లో దాదాపు 3,855 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకుంటే.. వారిలో 2,528ల మంది ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (FMGE) పరీక్షకు హాజరైతే వారిలో 558 మంది అర్హత సాధించారు. ఈ దేశంలో ఎంబీబీఎస్‌ చదవాలనుకునే భారతీయ విద్యార్ధులకు నీట్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

పోలాండ్‌

2022 ఏడాదికి 5 వేల మంది ఇండియన్‌ విద్యార్ధులు పోలాండ్‌లో ఎంబీబీఎస్‌ అభ్యసిస్తున్నారు. అక్కడ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నీట్‌ పాస్‌ మార్కులు తప్పనిసరి.

అలాగే నేపాల్, బంగ్లాదేశ్‌, చైనా వంటి పలు దేశాల్లోని ప్రసిద్ధ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలు కేవలం నీట్‌ ర్యాంకు ఆధారంగా మాత్రమే కల్పిస్తారు. కాగా ఈ ఏడాది జరగనున్న నీట్‌ పరీక్షకకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఈ వారంలో లేదా వచ్చేవారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.