PM Boris Johnson: ఆ దేశంలో కరోనా కల్లోలం.. 150000 దాటిన మృతుల సంఖ్య.. ప్రధాని ఆందోళన
British PM Boris: కరోనా వైరస్ కోరల్లో చిక్కి ప్రపంచ దేశాలతో పాటు, బ్రిటన్ కూడా అల్లాడుతోంది. కరోనా వైరస్ బారిన పడి.. ఇప్పటి వరకూ దేశంలో 1,50,000 మందికి పైగా మరణించారని ప్రభుత్వం..
British PM Boris Johnson: కరోనా వైరస్ కోరల్లో చిక్కి ప్రపంచ దేశాలతో పాటు, బ్రిటన్ కూడా అల్లాడుతోంది. కరోనా వైరస్ బారిన పడి.. ఇప్పటి వరకూ దేశంలో 1,50,000 మందికి పైగా మరణించారని ప్రభుత్వం తెలిపింది. కరోనా తీవ్ర ప్రభావం చూపించిన దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. కరోనాతో పోరాడుతూ మరణించినవారి గురించి ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ట్విట్టర్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘కరోనా వైరస్ కారణంగా మన దేశంలో మరణించిన వారి సంఖ్య తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 150,000 కు చేరుకుందని తెలిపారు.
ఈ అంటువ్యాధి ప్రారంభమైనప్పటి నుండి కరోనా వైరస్ బారినపడి.. కేవలం 28 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 150,057 కి చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో.. మరణాల సంఖ్య దాదాపు 3,15,000కి చేరుకున్న ఏకైక యూరోపియన్ దేశం రష్యా మాత్రమే నని చెప్పారు. జాన్సన్, ‘కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన .. బాధిత కుటుంబ సభ్యులకు, స్నేహితులకు , సన్నిహితులకు తీరని లోటు.. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు.
2 లక్షలకు పైగా కేసులు:
ఇక గత వారం UKలో రోజువారీ కేసులు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. దాదాపు 2,00,000మందికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. దీంతో మళ్ళీ కఠిన నిబంధనలు అమలు చేయడం ప్రారంభించారు.. మళ్ళీ కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 146,390లామందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా వలన దేశ ఆరోగ్య వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోంది. పాజిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాత ఒంటిరిగా జీవిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీని వల్ల ప్రభుత్వపై భారం పడుతుంది. వ్యయం కూడా భారీగా పెరిగింది.
Also Read: చాణుక్యుడు చెప్పిన ఈ 4 విషయాలను పాటిస్తే.. ఆ వ్యక్తి జీవితంలో డబ్బుకి ఎప్పుడూ లోటు ఉండదు..