Dry Valley: ఆ ప్రదేశం అతి శీతల ప్రాంతంలో డ్రై వ్యాలీస్.. 20 లక్షల ఏళ్లుగా కురవని వానలు..
Dry Valley: అదొక మంచు ప్రదేశం... అతి శీతల ప్రదేశం.. అయినా లక్షల ఏళ్ళుగా ఆ ప్రదేశం వర్షాలకు నోచుకోలేదు.. అది పూర్తిగా మంచుతో కప్పి ఉండే అంటార్కిటికా ఖండంలోని 'కరువు' ప్రాంతం..
Dry Valley: అదొక మంచు ప్రదేశం… అతి శీతల ప్రదేశం.. అయినా లక్షల ఏళ్ళుగా ఆ ప్రదేశం వర్షాలకు నోచుకోలేదు.. అది పూర్తిగా మంచుతో కప్పి ఉండే అంటార్కిటికా ఖండంలోని ‘కరువు’ ప్రాంతం. అతి శీతలమైన ఈ ఖండంలో ఉత్తరం వైపు సముద్రతీరానికి సమీపంలో దాదాపు 4,800 చదరపు కిలోమీటర్ల మేర అత్యంత పొడిగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి. వీటిని ‘డ్రై వ్యాలీస్’ అంటారు. ఇక్కడ సుమారు 20 లక్షల ఏళ్లుగా వాన పడటంగానీ, మంచు కురవడంగానీ జరగలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో చాలావరకు ఒక్క చుక్క నీళ్లుగానీ, మంచుగానీ లేకుండా అత్యంత పొడిగా ఉంటుంది. అంతేకాదు.. ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా మైనస్ 14 నుంచి మైనస్ 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య గడ్డ కట్టించే చలి ఉంటుంది.
ఇంతటి మంచు ఖండంలో ఇలా పొడి ప్రదేశాలు ఉండటానికి కారణం ‘కాటబాటిక్ విండ్స్’గా పిలిచే గాలులే కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ డ్రైవ్యాలీస్ ప్రాంతానికి చుట్టూ ‘ట్రాన్స్ అట్లాంటిక్’గా పిలిచే పర్వతాలు ఉన్నాయి. డ్రైవ్యాలీస్ వైపు వీచే గాలులను ఈ పర్వతాలు అత్యంత పైకి ఎగిసేలా చేస్తాయి. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఆ గాలుల్లోని తేమ అంతా మంచుగా మారి పర్వతాలపై పడుతుంది. ఈ ప్రాంతంలో కొన్ని సరస్సులు కూడా ఉన్నాయి. ఎప్పుడో లక్షల ఏళ్ల కింద ఏర్పడ్డ ఆ సరస్సుల్లో అప్పటి నీరే ఉంది. వానలు, హిమపాతం లేకపోవడంతో కొత్తగా నీళ్లు చేరే అవకాశం లేదు. వేల ఏళ్లుగా వేసవికాలంలో స్వల్పంగా నీరు ఆవిరవుతూ వస్తుండటంతో ఈ సరస్సుల్లోని నీటిలో లవణాలు ఎక్కువ. ఆ నీళ్లు సముద్రపు నీటికన్నా మూడు రెట్లు ఉప్పగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతంలో ఉప్పునీటి సరస్సులను మరో వింతగా చెప్పవచ్చు. డ్రైవ్యాలీస్‌లోకి వచ్చే సీల్ జంతువులు.. అక్కడి పరిస్థితులను తట్టుకోలేక చనిపోతాయి. ఇలా చనిపోయిన వాటి శరీరాలు వందలు, వేల ఏళ్లపాటు చెడిపోకుండా ‘మమ్మీ’ల్లా ఉండిపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఇలాంటిదే మరో మరో ప్రదేశం అటకామా ఎడారి. చిలీ, పెరూ దేశాల మధ్య ఉన్న ఈ ఎడారిలో ఏళ్లకేళ్లు ఒక్క చుక్క వాన కూడా పడదు. ఒకవేళ పడినా ఏడాదికి ఒకట్రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువే పడుతుంది.
Also Read: ఆ దేశంలో కరోనా కల్లోలం.. 150000 దాటిన మృతుల సంఖ్య.. ప్రధాని ఆందోళన