Chanakya Niti: చాణుక్యుడు చెప్పిన ఈ 4 విషయాలను పాటిస్తే.. ఆ వ్యక్తి జీవితంలో డబ్బుకి ఎప్పుడూ లోటు ఉండదు..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన అనుభవాలను అనేక శాస్త్రాలుగా లిఖించాడు. తన జ్ఞానాన్ని 'వంచక'గా ఉపయోగించడంలో గొప్ప పండితుడు కనుక అతన్ని కౌటిల్య అని పిలుస్తారు..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన అనుభవాలను అనేక శాస్త్రాలుగా లిఖించాడు. తన జ్ఞానాన్ని ‘వంచక’గా ఉపయోగించడంలో గొప్ప పండితుడు కనుక అతన్ని కౌటిల్య అని పిలుస్తారు. దౌత్యం, ఆర్థికశాస్త్రం, రాజకీయాలు వంటి విషయాలపై విష్ణుగుప్తుడికి మంచి పట్టుఉంది. చాణుక్యుడు రచించిన నీతి శాస్త్రం నేటి మానవులకు అనేక జీవిత విధానాలను నేర్పుతుంది. వాటిని ఆచరిస్తే.. ఆ మనిషిజీవితం ఏ కలతలు, కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుందని పెద్దల నమ్మకం.. ఈరోజు మనిషి ఈ నాలుగు విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే.. అటువంటి ఎప్పుడూ డబ్బులకు ఇబ్బందిపడరని చాణుక్యుడు చెప్పాడు.. అవి ఏమిటో తెలుసుకుందాం..
చాణక్య నీతి ప్రకారం.. ఇంట్లో ఎప్పుడూ కలతలు, కన్నీరు.. యుద్ధవాతావరణం ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. సుఖశాంతులతో ఆహ్లాదంగా ఉన్నఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది.
డబ్బు ఎలా చూడాలంటే.. చాణక్యుడు చెప్పిన ప్రకారం.. ఏ వ్యక్తి అయినా డబ్బుపై వ్యామోహం కలిగి ఉండకూడదు. ఎందుకంటే డబ్బు సంపాదించిన తర్వాత ఎవరిలోనైనా అహంభావం ఏర్పడితే.. అటువంటి వ్యక్తుల దగ్గర ఎక్కువ కాలం డబ్బు ఉండదు. ధనం వచ్చిన తర్వాత కూడా అందరినీ గౌరవిస్తూ అందరి పట్ల వినయంగా ఉండాలి.
డబ్బు ఇచ్చే భరోసా: చాణక్య నీతి ప్రకారం.. మనకు కష్టం ఎదురైనప్పుడు డబ్బు నిజమైన స్నేహితుడి పాత్ర పోషిస్తుంది. డబ్బును దాతృత్వానికి, పెట్టుబడికి, రక్షణకు వినియోగించాలి. డబ్బును కేవలం ఆస్తులను పోగుచేసుకోవాలని దాచుకోకూడదు. అదే సమయంలో సంపదను నీళ్లలాగా వృధా చేయకూడదు. ఆలోచనాత్మకంగా, సరైన సమయంలో డబ్బును ఖర్చు చేయాలి.
డబ్బును ఖర్చు పెట్టె విధానం: చాణక్య నీతి ప్రకారం.. చాలా మంది డబ్బు వచ్చిన తర్వాత ఉచితానుచితం ఆలోచించకుండా నిర్లక్ష్యంగా ఖర్చు చేస్తారు. ఆలోచించకుండా అనవసరమైన వాటిపై డబ్బు ఖర్చు చేసేవారిపై లక్ష్మీకటాక్షం ఉండదు. అటువంటి వ్యక్తిని.. ఆ వ్యక్తి ఉన్న స్థలం నుంచి వెళ్ళిపోతుంది. కనుక డబ్బుని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అప్పుడు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.
సరైన మార్గంలో సంపాదించిన డబ్బు… చాణక్య నీతి ప్రకారం.. డబ్భులు ఎల్లప్పుడూ నిజాయితీగా సంపాదించాలి. అనైతిక మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు ఎవరి వద్ద ఎక్కువ కాలం ఉండదు. డబ్బు ఎల్లప్పుడూ సరైన మార్గంలో సంపాదించాలి.
Also Read: కరోనా విజృంభిస్తున్న వేళ జల్లికట్టుపై సర్వత్రా ఉత్కంఠ.. నేడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం