AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jallikattu: కరోనా విజృంభిస్తున్న వేళ జల్లికట్టుపై సర్వత్రా ఉత్కంఠ.. నేడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం

Tamilnadu-Jallikattu: ఓ వైపు దేశంలో మళ్ళీ కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న వేళ.. పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రాల్లోకి వెళ్లిపోతున్నాయి. మరోవైపు దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో..

Jallikattu: కరోనా విజృంభిస్తున్న వేళ జల్లికట్టుపై సర్వత్రా ఉత్కంఠ.. నేడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
Tamilnadu Jallikattu Cm Sta
Surya Kala
|

Updated on: Jan 10, 2022 | 8:48 AM

Share

Tamilnadu-Jallikattu: ఓ వైపు దేశంలో మళ్ళీ కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న వేళ.. పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రాల్లోకి వెళ్లిపోతున్నాయి. మరోవైపు దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో అతి పెద్ద పండగ సంక్రాంతి సంబరాలకు ప్రజలు రెడీ అవుతున్నారు. సంక్రాంతి పండగలో సంప్రదాయంగా  నిర్వహించే కోడి పందాలు, జల్లి కట్టు వంటి వాటిపై ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా ఆసక్తిని నెలకొంది.

తాజాగా తమిళనాడులో జల్లికట్టు నిర్వహణపై నేడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం ప్రకటించనున్నారు. దక్షిణ తమిళనాడు ఇప్పటికే జల్లికట్టు పోటీలకు ముస్తాబవుతోంది.  రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సీఎం స్టాలిన్ అత్యవసర సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులలో 85 శాతం ఓమిక్రాన్ గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు మరిన్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళ సాంప్రదాయ ఆట జల్లికట్టు నిర్వహణపై ప్రభుత్వ ఏ నిర్ణయం తీసుకుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మధురై జిల్లాలో ఈనెల 14 నుండి జల్లికట్టు పోటీలు ప్రారంభంకానున్నాయి.

కరోనా కేసులు పెరుగుతున్న వేళ రాష్ట్రంలో ఇప్పటికే నిన్న సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేసింది. అంతేకాదు.. ఇక నుంచి  ప్రతి ఆదివారం తమిళనాడులో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జల్లికట్టు పై సీఎం స్టాలిన్ నిర్ణయం ఏమి తీసుకుంటారో అని ఆసక్తినెలకొంది.

జల్లికట్టు తమిళనాడులో సంక్రాంతి సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగ దీసుకొనే ఒక ఆట. ఈ జల్లికట్టులో ఎద్దులను మచ్చిక చేసుకోవాలనుకొనేవారు అసలు ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. కనుమ పండుగ రోజున జల్లికట్టును అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. మదురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరు దగ్గర నిర్వహించే ఈ పోటీలను చూడడానికి భారీ సంఖ్యలో జనం హాజరవుతారు.

Also Read:  నేడు ధనుర్మాసంలో 26వ రోజు.. శ్రీకృష్ణుడిని తమ కోర్కెలు తీర్ప కృపజూపని అడుగుతున్న గోదా, గోపికలు..