AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Security: భారత ప్రధాని భద్రతపై సుప్రీంకోర్టు సీరియస్‌.. ఇవాళ విచారించనున్న త్రిసభ్య ధర్మాసనం!

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి భద్రత కల్పించడంలో లోపంపై సుప్రీంకోర్టు ఇవాళ సోమవారం విచారణ చేపట్టనుంది.

PM Modi Security: భారత ప్రధాని భద్రతపై సుప్రీంకోర్టు సీరియస్‌.. ఇవాళ విచారించనున్న త్రిసభ్య ధర్మాసనం!
Pm Security Breach
Balaraju Goud
|

Updated on: Jan 10, 2022 | 8:26 AM

Share

Supreme Court on PM Modi Security breach: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి భద్రత కల్పించడంలో లోపంపై సుప్రీంకోర్టు ఇవాళ సోమవారం విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. ప్రధానమంత్రి భద్రతలో లోపానికి సంబంధించిన అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రామన్న ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ లేవనెత్తారు. విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. రాష్ట్రం, కేంద్రం రెండూ కమిటీలు వేసుకున్నాయని, విచారణకు ఇద్దరినీ ఎందుకు అనుమతించడం లేదని అన్నారు. రాష్ట్ర, కేంద్ర కమిటీలు తమ పనిని ఆపాలని, మేము దీన్ని ఆర్డర్‌లో నమోదు చేయడం లేదని, అయితే రెండు కమిటీలకు తెలియజేయాలని అన్నారు.

ఈ కేసులో చండీగఢ్ డీజీ, ఎన్ఐఏ అధికారిని నోడల్ అధికారులుగా సుప్రీంకోర్టు నియమించింది. ప్రధాని భద్రతపై సీరియస్‌గా ఉన్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రం తమ సొంత కమిటీని పరిశీలించాలి. రికార్డులను భద్రపరచాలని పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అంటే ప్రధాని మోడీ వెళ్లే రూట్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని భద్రంగా ఉంచాలని కోరింది. రిజిస్ట్రార్ జనరల్‌కు అవసరమైన సమాచారాన్ని అందించాలని పంజాబ్ ప్రభుత్వం, పంజాబ్ పోలీసులు, ఎస్‌పిజి మరియు ఇతర ఏజెన్సీలను కూడా కోర్టు కోరింది. దీంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి కూడా సహకరించాలని కోరింది.

అసలు విషయం ఏమిటి? 42,750 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు చేరుకోనున్నారు. ఇందుకోసం వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్‌లో వెళ్లే అవకాశం లేకపోవడంతో రోడ్డు మార్గంలో జాతీయ అమరవీరుల స్మారక స్థూపానికి తీసుకెళ్తున్నారు. అయితే వేదిక నుండి కొంత దూరంలో, రైతులు నిరసన వ్యక్తం చేసి రహదారిని దిగ్బంధించారు. దీంతో ప్రధాని కాన్వాయ్ ఫ్లైఓవర్‌పై 15-20 నిమిషాల పాటు నిలిచిపోయింది. రోడ్డు ఖాళీగా లేకపోవడంతో ర్యాలీని రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

పోలీసుల నిర్లక్ష్యమే కారణమా? భద్రతా సంస్థ, రాష్ట్ర పోలీసులు పరస్పరం టచ్‌లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్రం నుంచి రాష్ట్ర పోలీసులకు లేఖలు రాగా, అందులో రైతుల ధర్నాపై హెచ్చరిక కూడా జారీ చేశారు. అయినప్పటికీ, పోలీసులు ప్రధానికి సురక్షితమైన మార్గం కోసం ఏర్పాట్లు చేయలేదు. లేదా రహదారిని క్లియర్ చేయలేదు. పంజాబ్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, భద్రతకు సంబంధించిన బ్లూ బుక్ నిబంధనలను పాటించలేదని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఆరోపించారు. ప్రధానమంత్రిని రక్షించడానికి సీజ్ చేయడం SPG పని, కానీ మిగిలిన వారిని రక్షించే బాధ్యత రాష్ట్రంపై ఉంది. ఈ విషయమై నివేదిక సమర్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రిత్వ శాఖ కోరింది.

Read Also… Man kills wife: భార్య కనిపించడంలేదంటూ పోలీసులకు భర్త ఫిర్యాదు.. క్లూస్ టీం ఎంట్రీతో భర్త జంప్!