Parliament: బ్రిటీష్ పార్లమెంటులో పోర్న్ రచ్చ.. ఇక్కడ ఇదే మొదటిసారి కాదు..
ఓ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ పార్లమెంటు లోపల తన ఫోన్‌లో పోర్న్ ఫిల్మ్ చూస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై అక్కడే ఉన్న మహిళా ఎంపీ నిరసన వ్యక్తం చేశారు.

యూకే పార్లమెంట్‌లో(UK Parliament) అత్యంత సంచలనాత్మకమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఓ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ పార్లమెంటు లోపల తన ఫోన్‌లో పోర్న్ ఫిల్మ్ చూస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై అక్కడే ఉన్న మహిళా ఎంపీ నిరసన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వార్త పత్రికల నివేదిక ప్రకారం, సంఘటన తర్వాత మహిళా ఎంపీ ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పలువురు ఎంపీలు కూడా ఇప్పటికే నిరసన వ్యక్తం చేశారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఒక మహిళా మంత్రితోపాటు ఇతర మహిళా ఎంపీలు ఈ విషయంపై నివేదికలను పరిశీలిస్తున్న కన్జర్వేటివ్ చీఫ్ విప్ క్రిస్ హీటన్-హారిస్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఇలాంటి పనులు చేసిన ఎంపీలు ఎవరనేది మాత్రం వెల్లడి కాలేదు. అదే సమయంలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు ఇంతకు ముందు కూడా ఇలాంటి పని చేశారని అయితే ఈ విషయాన్ని అటకెక్కించారని ప్రచారం జరుగుతోంది.
స్ట్రాంగ్ యాక్షన్ ..
ఈ మేరకు కన్జర్వేటివ్ విప్స్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం, చీఫ్ విప్ క్రిస్ హీటన్ హారిస్ ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపింది. ఇటువంటి ప్రవర్తనను అస్సలు సహించలేమని పేర్కొంది. అదే సమయంలో కేసు నివేదిక రాగానే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు టోరీ పార్టీకి చెందినవారని పలు నివేదికల్లో వెల్లడైంది. టోరీ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత కన్జర్వేటివ్ పార్టీ 1834లో ఉనికిలోకి వచ్చింది. టోరీ పార్టీని బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ మొదలైంది.
ఇవి కూడా చదవండి: Donald Trump: ట్రంప్ రోజూ 10 వేల డాలర్లు జరిమానా కట్టాలటా.. ఎందుకో తెలుసా?
Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!
