Donald Trump: ట్రంప్‌ రోజూ 10 వేల డాలర్లు జరిమానా కట్టాలటా.. ఎందుకో తెలుసా?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి న్యూయార్క్‌ కోర్టు భారీ షాక్‌ ఇచ్చింది.. రోజుకు 10 వేల డాలర్లు జరిమానాగా కట్టాలని ఆదేశించింది. పదవిలో ఉన్నా లేకున్నా..

Donald Trump: ట్రంప్‌ రోజూ 10 వేల డాలర్లు జరిమానా కట్టాలటా.. ఎందుకో తెలుసా?
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 28, 2022 | 7:01 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు(US Former President) డొనాల్డ్‌ ట్రంప్‌కి(Donald Trump) న్యూయార్క్‌ కోర్టు భారీ షాక్‌ ఇచ్చింది.. రోజుకు 10 వేల డాలర్లు జరిమానాగా కట్టాలని ఆదేశించింది. పదవిలో ఉన్నా లేకున్నా వివాదాస్పద నాయకునిగా పేరు తెచ్చుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వార్తల్లోకి వచ్చారు.. న్యూయార్క్‌ కోర్టు ఆయనకు ఇచ్చిన ఆదేశం కలకలం సృష్టించింది. ట్రంప్‌ తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలకు అటార్నీ జనరల్‌ ఆఫీసులో సమర్పించే వరకూ రోజుకు 10 వేల డాలర్ల జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.. అంటే ఇండియన్‌ కరెన్సీలో ఆయన రోజుకు 7 లక్షల రూపాయాలు కట్టాల్సిం ఉంటుంది.. ట్రంప్‌ ఈ జరిమానాను ఏప్రిల్‌ 26వ తేదీ నుంచే చెల్లించాల్సి ఉంటుంది..

డొనాల్డ్ ట్రంప్ తన ఆస్తులపై ఎక్కువ రుణాలు పొందడం కోసం తప్పుడు విధానంలో విలువ కట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.. దీనిపై 2019లో దర్యాప్తు ప్రారంభమైంది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని న్యూయార్క్‌ కోర్టు ఆదేశించగా, ట్రంప్‌ పట్టించుకోలేదు.. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి ఎంగోరోన్‌ ఆయనకు ఈ జరిమానా విధించారు.. ట్రంప్‌ ఉద్దేశ్య పూర్వకంగానే కోర్టు ఆదేశాలను ధిక్కరించారని ఎంగోరోన్‌ అన్నారు.. గోల్ఫ్ క్లబ్‌లు, పెంట్‌హౌస్ అపార్ట్‌మెంట్‌తో సహా ఆస్తుల విలువలను ఎక్కువ చేసి చూపించినట్లు ఆధారాలున్నాయని తెలిపారు..

ట్రంప్‌ రుణాల కోసం ఆస్తుల విలువ ఎక్కువ చూపారని.. పన్నులు చెల్లించే క్రమంలో తక్కువగా చూపించారని ఆరోపణలున్నాయి.. అయితే ఈ దర్యాప్తు రాజకీయ ప్రేరితమని ఆయన ఆరోపిస్తున్నారు.. న్యాయమూర్త ఆదేశాలపై అపీలు చేస్తామని ట్రంప్‌ తరపు న్యాయవాదులు చెబుతున్నారు..

ఇవి కూడా చదవండి: Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్‌.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్ వెరీ స్పెషల్.. మీరు రొమాంటిక్ ఆ? సింగిల్ ఆ? చెప్పేస్తుంది..!