ఇదెక్కడి చోద్యం.. పాత ఇంటి తలుపులకు రంగులు వేసిన పాపం..! ఓ మహిళకు రూ.19 లక్షల జరిమానా..

ఇంటి ముందు తలుపుకు రంగులు వేసినందుకు ఓ మహిళా యజమాని రూ. 19 లక్షలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇంటి పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఇంటి తలుపులకు గులాబీ రంగు వేశారు.

ఇదెక్కడి చోద్యం.. పాత ఇంటి తలుపులకు రంగులు వేసిన పాపం..!  ఓ మహిళకు రూ.19 లక్షల జరిమానా..
Homes Door
Follow us

|

Updated on: Oct 31, 2022 | 11:02 AM

ఓ తలుపు కారణంగా వారికి భారీ నష్టంవాటిల్లింది. ఓ యువతి తన ఇంటి తలుపు రంగు మార్చినందుకు లక్షల్లో జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. చాలా, సాధారణమైన విషయానికి వారికి జరిమానా విధించబడింది.. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో యువతికి పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఎడిన్‌బర్గ్‌లోని న్యూటౌన్‌లో నివసించే మిరాండా డిక్సన్, తలుపు కారణంగా పెద్ద ఇబ్బందుల్లో పడింది. జార్జియన్ ఇంటి ముందు తలుపుకు రంగులు వేసినందుకు మిరాండా 19 లక్షలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇంటి పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఇంటి తలుపులకు గులాబీ రంగు వేశారు. మిరాండా ఈ ఇంటిని తన తల్లిదండ్రుల నుండి 2019లో వారసత్వంగా పొందింది. వారిపై వచ్చిన ఫిర్యాదు మేరకు జరిమానా విధించారు.

ఈ మేరకు.. ఎడిన్‌బర్గ్ సిటీ కౌన్సిల్ మాట్లాడుతూ.. ఇక్కడి భవనాల చారిత్రాత్మక లక్షణానికి అనుగుణంగా తలుపులకు రంగులు వేయడం వల్ల వారికి జరిమానా విధించినట్లు తెలిపారు. తన ఇంటి తలుపుపై​ఫిర్యాదు కుట్రపూరితమైనదిగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా విషయంగా వారు విమర్శించారు. తలుపుల రంగును కూడా మార్చాలని వారికి సూచించినట్టుగా తెలిపారు. మరింత సరిపోలే రంగును వేయించాలని, సిటీ కౌన్సిల్ కూడా డార్క్‌గా ఉండాలని తెలియశారు. అయితే, ఇందుకు కారణం లేకపోలేదని తెలిసింది.

ఈ ఇల్లు ఎడిన్‌బర్గ్ న్యూ టౌన్ వరల్డ్ హెరిటేజ్ పరిరక్షణ ప్రాంతంలో ఉంది. అందువల్ల, ఆ ప్రాంతంలోని ఆస్తులకు ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై కొన్ని నియమాలు ఉన్నాయి. ఎడిన్‌బర్గ్‌లోని పాత, కొత్త పట్టణాలు 1995లో యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను పొందాయి. ప్రణాళిక అనుమతి కోసం మహిళ దరఖాస్తు చేసుకోకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. వారు తలుపు రంగును మార్చడానికి సిద్ధంగా లేరు. అదే నోటీసుకు దారి తీసింది.

ఇవి కూడా చదవండి
Britain Women

ఇదిలా ఉంటే, ఆమె ఇంటి నుండి ఐదు నిమిషాల నడక దూరంలో డిక్సన్ పరిసరాల్లో ప్రకాశవంతమైన పెయింట్ చేయబడిన తలుపుల చిత్రాలను తీశారు. ఇవన్నీ ప్రపంచ వారసత్వ ప్రదేశం కిందకు వస్తాయి. పూర్తి అసంబద్ధమైన విషయం ఏమిటంటే ఆ ప్రాంతంలోని ఇతర తలుపుల గురించి నేను కౌన్సిల్‌ని అడిగినప్పుడు వారు ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని చెప్పారంటూ బాధితులు వాపోయారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి