మన ఫ్రెండే కదా అనుకుని కారెక్కారు..! కిడ్నాప్‌ చేసి రూ.5కోట్లు డిమాండ్‌ చేసిన నిందితుడు.. ట్విస్ట్‌ ఏంటంటే..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Oct 31, 2022 | 10:03 AM

అయితే పాడుబడిన ఇంట్లో నుంచి తప్పించుకున్న ఇద్దరు యల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులు పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.

మన ఫ్రెండే కదా అనుకుని కారెక్కారు..! కిడ్నాప్‌ చేసి రూ.5కోట్లు డిమాండ్‌ చేసిన నిందితుడు.. ట్విస్ట్‌ ఏంటంటే..
Police Custody (file Photo)

స్నేహితుడిని కిడ్నాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా రామనగరలోని క్యాజిల్ రాక్‌లో వెలుగు చూసింది. ధార్వాడ్‌కు చెందిన రాహుల్‌ భీంరావు సిండే, సంతోష్‌ హిరేమఠ్‌తో సహా ఆరుగురు సభ్యుల బృందం వారి స్నేహితుడు మలప్రభ నివాసి హనుమంత గౌడ్‌, ధార్వాడ నివాసి, మలేషియాలోని కౌలాలంపూర్‌కు చెందిన కార్తీక్‌ ఉలగనాథన్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం. రామనగరలోని క్యాజిల్ రాక్‌కు వెళ్లే మార్గంలో కారులో ప్రయాణిస్తూ సుమారు 26 లక్షల విలువైన వస్తువులను దోచుకెళ్లారు.

వారి రెండు చేతులు, కాళ్లు కట్టేసి కారులో ఎక్కించుకుని యల్లాపూర్ అటవీప్రాంతంలో నిర్మానుష్యంగా ఉన్న ఇంట్లో బంధించారని ఆరోపించారు. ఐదు కోట్లు తీసుకురాకపోతే చంపేస్తానని బెదిరించినట్లు కూడా చెబుతున్నారు.

అయితే పాడుబడిన ఇంట్లో నుంచి తప్పించుకున్న ఇద్దరు యల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులు పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు యల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu