High BP : వారం రోజుల పాటు పరగడుపునే దీన్ని తాగండి.. మీ బీపీ,షుగర్‌ కంట్రోల్‌కి వచ్చేస్తుంది..

ఎంత‌టి బీపీ ఉన్నా స‌రే ఈ ర‌సాన్ని తాగుతుంటే త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది. క‌నీసం నెల రోజుల పాటు తీసుకోవాలి. త‌రువాత కొద్ది రోజులు మానేయాలి. ఈ రసంతో మధుమేహ బాధితుల్లో షుగ‌ర్‌ కంట్రోల్‌ చేస్తుంది. లివ‌ర్ శుభ్రంగా మారుతుంది.

High BP : వారం రోజుల పాటు పరగడుపునే దీన్ని తాగండి.. మీ బీపీ,షుగర్‌ కంట్రోల్‌కి వచ్చేస్తుంది..
Low Bp
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 31, 2022 | 7:48 AM

హైబీపీ..అధిక ర‌క్త‌పోటు..ప్రస్తుత కాలంలో చాలా మంది దీని బారినపడుతున్నారు. హై బీపీకి అనేక కారణాలు ఉన్నప్పటికీ, అధిక ఒత్తిడి కార‌ణంగానే ఎక్కువమంది ప్రజలు బీపీ బారిన ప‌డుతున్నారు. ఒకసారి బీపీ ఎటాక్‌ చేసిందంటే.. ఇక జీవితాంతం వరకు మందుల‌ను వాడాల్సి ఉంటుంది. లేదంటే మరిన్ని అనర్థాలకు దారి తీస్తుంది. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యం చెడిపోతుంది. హార్ట్ ఎటాక్‌లు, ఇత‌ర గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ప్ర‌స్తుతం చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారు కూడా బీపీ బారిన ప‌డుతున్నారు. అయితే బీపీ వ‌చ్చింద‌ని కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. ఇంట్లో మనకు అందుబాటులో ఉండే వాటితోనే బీపీని చాలా వ‌ర‌కు కంట్రోల్ చేసుకోవచ్చు.

కాకర కాయతో బీపీకి చెక్‌ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకోసం తాజాగా కాకర కాయను ముక్క‌లుగా కోసి కప‌చ్చ‌గా దంచుకుని రసాన్ని పిండుకోవాలి.. ఆ ర‌సాన్ని 30 ఎంఎల్ మోతాదులో ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. దీన్ని తాగిన త‌రువాత గంట వ‌ర‌కు ఏమీ తినకూడదని చెబుతున్నారు. ఇలా రోజూ ప‌ర‌గ‌డుపున కాక‌ర‌ర‌సం తాగ‌డం వ‌ల్ల 7 రోజుల్లోనే మీ బీపీ అదుపులోకి వ‌చ్చేస్తుంది. ఎంత‌టి బీపీ ఉన్నా స‌రే ఈ ర‌సాన్ని తాగుతుంటే త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది. క‌నీసం నెల రోజుల పాటు తీసుకోవాలి. త‌రువాత కొద్ది రోజులు మానేయాలి. బీపీ పెరుగుతుంది అనుకుంటే మ‌ళ్లీ 7 నుంచి 20 రోజుల పాటు తీసుకోవాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తుంటే త‌ప్ప‌క బీపీ అదుపులోకి వ‌స్తుంది. దీంతో కొన్నాళ్ల‌కు బీపీ మందుల‌ను వాడ‌డం మానేస్తారు.

కాక‌ర‌కాయ ర‌సం తాగితే కేవ‌లం బీపీ త‌గ్గ‌డం మాత్ర‌మే కాదు..మధుమేహ బాధితుల్లో షుగ‌ర్‌ కంట్రోల్‌ చేస్తుంది. లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాకరకాయ శరీరంలోని వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. వీటిని ఉడికించిన నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్ల్లు దరిచేరవు. ఆరోగ్యానికి హాని చేసే కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులతో పాటు క్యాన్సర్, మలబద్ధకం, లివర్, మూత్రపిండాల సమస్యలకు కూడా కాకర మంచి ఆహారం.

ఇవి కూడా చదవండి

మధుమేహగ్రస్తులు కాకరకాయను తమ ఆహారంలో చేర్చుకుంటే ఇన్సులిన్ స్థాయిల్లో తేడా రాకుండా నియంత్రణలో ఉంచుతూ రక్తంలోని చెక్కర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాలిన గాయాలను, పుండ్ల ను మాన్పడంలో కాకరకాయలోని గుణాలు బాగా పని చేస్తాయి. రక్తాన్ని శుధ్ధి పరిచి గుండె కు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది. దీంతో ప‌లు విధాలుగా లాభాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక కాక‌ర‌కాయ ర‌సాన్ని తాగ‌డం మ‌రిచిపోకండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి