AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడాకుల కోసం 66 ఏళ్ల భర్త నుంచి రూ.100 కోట్లు డిమాండ్ చేసిన భార్య!..

66 ఏళ్ల బిలియనీర్‌కు ఇప్పటికే వివాహమైంది. విడాకుల ప్రక్రియ జరుగుతోంది. విడాకుల తర్వాత, అతను కొత్త వివాహ జీవితం ప్రారంభించాలనుకుంటున్నాడు.. ఈ బిలియనీర్ పేరు..

విడాకుల కోసం 66 ఏళ్ల భర్త నుంచి రూ.100 కోట్లు డిమాండ్ చేసిన భార్య!..
John Paulson
Jyothi Gadda
|

Updated on: Oct 29, 2022 | 9:38 PM

Share

66 ఏళ్ల అమెరికన్ బిలియనీర్, 32 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మధ్య సంబంధం చాలా చర్చనీయాంశమైంది. గత కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. 66 ఏళ్ల బిలియనీర్‌కు ఇప్పటికే వివాహమైంది. విడాకుల ప్రక్రియ జరుగుతోంది. విడాకుల తర్వాత, అతను కొత్త వివాహ జీవితం ప్రారంభించాలనుకుంటున్నాడు.. ఈ బిలియనీర్ పేరు జాన్ పాల్సన్. అమెరికాలో జన్మించిన జాన్ పాల్సన్ సాధారణ వ్యక్తి కాదు. అతను 250 బిలియన్ల ఆస్తి పరుడుగా ఫోర్బ్స్ నివేదించింది. పేజ్ సిక్స్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం, అతను న్యూయార్క్‌ చెందిన ఓ పట్టణంలో ఒక విలాసవంతమైన బంగ్లాలో 32 తన ప్రియురాలితో కలిసి కనిపించాడు. మరోవైపు, అతని ప్రియురాలు కూడా ఒక గొప్ప వ్యాపార వేత్తగా తెలిసింది. ప్రజలకు డైట్ ప్లాన్‌లు చెప్పడం, వాటిని నిర్వహించడం ద్వారా డబ్బు సంపాదిస్తారు. జాన్ పాల్సన్ అలీనాతో బిడ్డను కనాలని ఆశపడుతున్నాడు.. సో జాన్ పాల్సన్, అలీనా త్వరలో పెళ్లి చేసుకోవచ్చని సమాచారం. ఈ వారం ప్రారంభంలో ఈ జంట న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్‌తో కలిసి ఫోటో దిగారు.

ఇదిలా ఉంటే, జాన్ భార్య వీరి ప్రేమకు బ్రేక్ వేసినట్లుగా తెలిసింది.. జాన్ పాల్సన్‌కు విడాకులు ఇస్తానని, దానికి బదులు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని భార్య డిమాండ్ చేసినట్టుగా సమాచారం. 34 ఏళ్ల అలీనాతో తన భర్త ఎఫైర్ వార్తలను చూసి తొలుత ఆమె ఆశ్చర్యపోయింది. జాన్ న్యాయవాది బిల్ జాబెల్, జాన్ దాతృత్వాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోవాలని అన్నారు. ఎందుకంటే అతను విడాకుల కోసం చట్టపరమైన పరిహారం కంటే ఎక్కువ భార్యకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ, జాన్ భార్య విడాకుల కోసం దాదాపు 82 బిలియన్ రూపాయలు ($1 బిలియన్-100 కోట్ల రూపాయలు) అడిగింది. జాన్ భార్య తరఫు న్యాయవాది రాబర్ట్ కోహెన్ మాట్లాడుతూ, పెళ్లి తర్వాత సంపదను పెంచుకునే వ్యక్తులు భార్యకు అవసరమైన భత్యం అందించరు. అతను (జాన్) తన భార్యను స్థిరపరచమని ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అది పూర్తిగా తప్పు.

కొన్ని నివేదికల ప్రకారం జాన్ పాల్సన్ సంపద 24 వేల కోట్లు. అతని భార్య జెన్నీ పాల్సన్ వయస్సు 50 సంవత్సరాలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మీడియా ద్వారానే మరోయువతికి తన భర్తకు ఉన్న సంబంధం గురించి తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి