దారుణం: బాయ్‌ఫ్రెండ్‌ కలవలేదని బాలిక సూసైడ్‌.. ఫ్రెండ్‌తో పాటు విషం తాగిన మరో ఇద్దరు..

పార్క్‌లో పడివున్న బాలికల్ని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కి ఫోన్‌ చేశారు. అనంతరం పోలీసులకు సైతం సమాచారం అందించారు. ముగ్గురిని తొలుత ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

దారుణం: బాయ్‌ఫ్రెండ్‌ కలవలేదని బాలిక సూసైడ్‌.. ఫ్రెండ్‌తో పాటు విషం తాగిన మరో ఇద్దరు..
mothers dead body
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 29, 2022 | 7:34 PM

స్కూల్‌ బంక్‌ కొట్టిన ముగ్గురు బాలికలు.. ప్రాణాలకు తెగించారు. విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇద్దరు బాలికలు మరణించగా, మరో బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది ఈ విషాద సంఘటన. సెహోర్ జిల్లా అష్టా పట్టణానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఒక స్కూల్‌లో చదువుతోంది. అయితే, ఆ బాలిక బాయ్‌ఫ్రెండ్‌ తనతో మాట్లాడం మానేశాడని తెలిసింది. అతడ్ని స్వయంగా కలిసేందుకు ఆ బాలిక శుక్రవారం స్కూల్‌ బంక్‌ కొట్టి వెళ్లింది.. క్లాస్‌మేట్స్‌ అయిన మరో ఇద్దరు బాలికలతో కలిసి వంద కిలోమీటర్ల దూరంలోని ఇండోర్‌కు బస్సులో బయల్దేరింది.

ఇండోర్‌లో బస్సు దిగిన తర్వాత ఆ బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసింది. అతడి రాకకోసం ఒక పార్క్‌లో తన ఇద్దరు స్నేహితురాళ్లలో కలిసి ఎదురుచూసింది. కానీ, కానీ, ఆ అబ్బాయి సదరు బాలికను కలిసేందుకు నిరాకరించాడు. వాళ్లు చాలా సమయం వరకు అతడి కోసం వెయిట్‌ చేశారు. కానీ, అతడు పార్క్‌ వద్దకు రాలేదు. దీంతో వెంట తెచ్చుకున్న విషాన్ని ఆ బాలిక తాగింది. అయితే తన ఇంట్లో సమస్యలు ఉన్నాయంటూ మరో బాలిక కూడా విషం తాగింది. ఇది చూసి మూడో బాలిక కూడా మిగిలిన విషాన్ని తాగేసింది. ఆపై ముగ్గురు అపస్మారక స్థితిలో పడిపోయారు.

పార్క్‌లో పడివున్న బాలికల్ని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కి ఫోన్‌ చేశారు. అనంతరం పోలీసులకు సైతం సమాచారం అందించారు. ముగ్గురిని తొలుత ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎంవై హాస్పిటల్‌కు తరలించారు. అయితే తొలుత విషం సేవించిన ఇద్దరు బాలికలు మరణించారు. చివరిగా విషం తాగిన బాలిక ప్రాణాలతో బయటపడింది. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ బాలిక జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పింది. దీంతో ఆమె స్టేట్‌మెంట్‌ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి