పరీక్షలు తప్పించుకోవడానికి విద్యార్థి చేసిన హై డ్రామా.. సీసీటీవీ ఫుటేజ్‌ చూసిన ఖాకీలే కంగుతిన్నారు.. ఇంతకీ ఏం చేశాడంటే..

12 ఏళ్ల విద్యార్థి పరీక్షలు రాయనని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు ఒప్పుకోకపోవడంతో పరీక్షల నుంచి తప్పించుకునేందుకు ఒక ప్లాన్‌ వేశాడు. ఈ నెల 26న స్కూల్‌ వద్ద

పరీక్షలు తప్పించుకోవడానికి విద్యార్థి చేసిన హై డ్రామా..  సీసీటీవీ ఫుటేజ్‌ చూసిన ఖాకీలే కంగుతిన్నారు.. ఇంతకీ ఏం చేశాడంటే..
Cctv Footages
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 29, 2022 | 7:49 PM

సాధారణంగానే స్కూల్‌ విద్యార్థులు పరీక్షలంటే భయపడుతుంటారు. పరీక్షలు వాయిదా వేస్తే బాగుండును అనుకుంటారు. అలాగే ఆశపడిన ఓ విద్యార్థి ఎగ్జామ్స్‌ తప్పించుకోవడానికి ఎవరూ చేయని పని చేశాడు. పరీక్ష నుంచి తప్పించుకునేందుకు ఒక విద్యార్థి మాస్టార్‌ ప్లాన్‌ వేశాడు. ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడాడు. స్కూల్‌కు వెళ్లని ఆ బాలుడు, తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని, వారి నుంచి తప్పించుకుని బయటపడినట్టుగా అందరినీ నమ్మించాడు. అది విన్న విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో తేలిన అసలు సంగతి తెలిసి ఖాకీలే కంగుతిన్నారు. ఎగ్జామ్స్‌ తప్పించుకోవడానికి బాలుడు చేసిన ప్లాన్‌ మొత్తం స్థానిక సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ సంఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.

కిల్పాక్‌లోని స్కూల్‌కు చెందిన 12 ఏళ్ల విద్యార్థి పరీక్షలు రాయనని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు ఒప్పుకోకపోవడంతో పరీక్షల నుంచి తప్పించుకునేందుకు ఒక ప్లాన్‌ వేశాడు. ఈ నెల 26న స్కూల్‌ వద్ద ఒక ఆటో డ్రైవర్‌ తనను కిడ్నాప్‌ చేసినట్లు ఆరోపించాడు. పచ్చయ్యప్ప కాలేజీ మెట్రో స్టేషన్ సిగ్నల్‌ వద్ద ఆటో ఆగడంతో తప్పించుకుని మెట్రో స్టేషన్‌లోకి వెళ్లినట్లు ఒకరి ఫోన్‌ నుంచి తల్లిదండ్రులకు, అక్కడున్న పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ బాలుడ్ని సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం అతడి తల్లిదండ్రులకు అప్పగించారు.

కాగా, ఆ విద్యార్థి కిడ్నాప్‌పై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరిపారు. ఆ స్కూల్‌ పరిధిలోని సీసీటీవీల ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే ఎక్కడా కూడా ఆ బాలుడు కిడ్నాప్‌ అయిన దాఖలాలు కనిపించలేదు. మరోవైపు ఆ రోజున స్కూల్‌ ఎగ్గొట్టిన ఆ బాలుడు బస్సులో పచ్చయ్యప్ప కళాశాల మెట్రో స్టేషన్ చేరుకున్నాడు. అనంతరం మెట్రో స్టేషన్‌లోకి వెళ్లి అక్కడ పోలీసులను కలిశాడు. ఆటో డ్రైవర్‌ తనను కిడ్నాప్ చేశాడని, ఎలాగోలా తప్పించుకుని వచ్చినట్లు చెప్పాడు. ఈ మేరకు మెట్రో స్టేషన్‌ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ చెక్‌ చేసిన పోలీసులకు ఈ విషయం తెలిసింది. దీంతో మరునాడు ఆ బాలుడ్ని నిలదీయగా కిడ్నాప్ డ్రామా గురించి చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ విద్యార్థిని హెచ్చరించి వదిలేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి