AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: శీతాకాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే ఈ 5 సహజ పదార్థాలు తప్పక తినండి..

చలికాలంలో అప్రమత్తంగా ఉండి మనల్ని మనం కాపాడుకోవాలి. శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రతను పెంచుకోదగిన సహాజ ఆహారపదార్థాలు కొన్ని ఉన్నాయి.

Health Tips: శీతాకాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే ఈ 5 సహజ పదార్థాలు తప్పక తినండి..
Natural Food Items
Jyothi Gadda
|

Updated on: Oct 29, 2022 | 6:17 PM

Share

సంవత్సరపు చివరలో వచ్చే చలికాలం సంతోషాలనే కాదు.. సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, జలుబు, దగ్గు వంటి సమస్యలు తప్పవు. అందుకే చలికాలంలో అప్రమత్తంగా ఉండి మనల్ని మనం కాపాడుకోవాలి. శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రతను పెంచుకోదగిన సహాజ ఆహారపదార్థాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

నెయ్యి: ఆవు పాలతో చేసిన నెయ్యి రుచికరమైనది. ఆరోగ్యకరమైనది. ఆయుర్వేదంలో ఇది అన్ని రోగాలను నయం చేసే ఔషధ గుణాలు కలిగిన ఆహారంగా పరిగణించబడుతుంది. రోజూ ఒక చెంచా ఈ నెయ్యి తీసుకుంటే చాలా మంచిది. ఇది మీ రోగనిరోధక, జీర్ణ వ్యవస్థను పెంచుతుంది.

డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ వివిధ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. మీ అల్పాహారంలో జీడిపప్పు, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోండి. డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీకు శక్తిని ఇవ్వడమే కాకుండా మీ శరీరాన్ని వేడి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

తులసి: తులసిని ఆయుర్వేదంలో పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. ఈ సర్వసాధారణమైన, చవకైన మొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది పెరగడం కూడా చాలా సులభం. తులసి మొక్క ముఖ్యంగా శీతాకాలంలో బ్యాక్టీరియా వైరల్ వ్యాధులను నివారించడం, రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా మనకు చాలా సహాయపడుతుంది. తులసి టీ తయారు చేయడం ద్వారా దీనిని తీసుకోవచ్చు. రోజూ ఒక తులసి ఆకు తింటే మంచిది.

అల్లం: అల్లం అనేక ఔషధ గుణాలు కలిగిన పదార్థం. చలికాలంలో జలుబు లేదా గొంతు నొప్పికి అల్లం దివ్యౌషధం. అల్లం వికారం, గొంతు నొప్పికి చికిత్స చేయడం, ఒత్తిడిని తగ్గించడం వంటి వివిధ వాటిలకు నివారణగా పనిచేస్తుంది.. మంచి నిమ్మకాయ, అల్లం టీ అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. చలికాలంలో రోజూ అల్లం టీ తాగడం వల్ల జలుబు, దగ్గు, శ్వాస సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

నువ్వుల లడ్డూలు: నువ్వుల లడ్డూలు శీతాకాలంలో తినడానికి ఆరోగ్యకరమైన చిరుతిండి. నువ్వులు చలికాలంలో తినడానికి అనువైన ఆహారం. ఎందుకంటే ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. దాని అనేక ఆరోగ్య ప్రయోజనాలలో, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మీకు మరింత శక్తిని ఇస్తుంది. నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..