Biryani shops to Closed: శృంగార కోరికలు తగ్గుతున్నాయని బిర్యానీ షాపును మూసివేయించిన ఛైర్మన్..!

Biryani shops to Closed: శృంగార కోరికలు తగ్గుతున్నాయని బిర్యానీ షాపును మూసివేయించిన ఛైర్మన్..!

Anil kumar poka

|

Updated on: Oct 31, 2022 | 9:57 AM

పశ్చిమ బెంగాల్‌లో మున్సిపాలిటీ చైర్మన్ తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. ఓ వింత సాకుతో ఓ బిర్యానీ షాపును మూసివేయించారు. ప్రస్తుతం ఈ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ లీడర్‌, కుచ్‌బెహార్‌ మున్సిపాలిటీ చైర్మన్ రవీంద్రనాథ్‌ ఘోష్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.


బిర్యానీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వల్ల పురుషుల్లో శృంగార కోరికలు తగ్గుతున్నాయని ఘోష్ పేర్కొన్నారు. ఈ కారణంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓ బిర్యానీ షాపును మూసివేయించారు. కుచ్‌బెహార్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా బిర్యానీ షాపులు నిర్వహిస్తున్నారన్నారు ఘోష్. వారు తయారు చేసే బిర్యానీలను తినడం వల్ల శృంగార సామర్థ్యం తగ్గుతుందని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎలాంటి లైసెన్సులు లేకుండానే బిర్యానీ షాపులను నిర్వహిస్తున్నారని, అలాంటి షాపులను మూసివేయిస్తున్నామని ఘోష్ పేర్కొన్నారు. ఈ అంశంపై బెంగాల్‌కు చెందిన మాజీ మంత్రి స్పందించారు. మసాలా దినుసుల వల్ల లైంగిక పటుత్వం తగ్గుతుందనడానికి ఆధారాలు లేకపోయినప్పటికీ, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా బిర్యానీ షాపులను మూసివేయించాల్సి వచ్చిందంటు వివరణ ఇచ్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో