Cat and Lion: స్క్రీన్ పై ఉన్నా , ఎదురుగా ఉన్నా సింహం సింహమే.. టీవీలో సింహం గాండ్రిస్తే ఇంట్లో పిల్లి పరుగు..
కొన్ని సందర్భాల్లో 'ఆకలేస్తుంది కదా అని సింహం గడ్డి తినదురా' అనే మాటలు వింటుంటాం. అది సింహం ప్రత్యేకత. సింహం అడవికి రారాజు. దానికి ఆకలేస్తేనే వేటాడుతుంది. లేకపోతే అది ఎంతటి క్రూర జంతువైనా దాని పక్కనుంచి వెళ్లినా ఏమీ చేయదు.
తాజాగా ఓ సింహం, పిల్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పిల్లి టీవీ చూస్తుంది. టీవీలో ‘ది లయన్ కింగ్’ సినిమా ప్లే అవుతుంది. దానికి తెరపై సింహాలు కనిపించగానే దగ్గరగా వెళ్తుంది. ఈ సన్నివేశాన్ని పిల్లి చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తోంది. అదే సమయంలో తెరపై ఓ పెద్ద సింహం దగ్గరగా వచ్చి గట్టిగా గాండ్రించింది. దాంతో పిల్లి సడన్ గా ఉలిక్కిపడింది. భయంతో వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. ఈ క్రమంలో అది కిందపడిపోయి మళ్లీ లేచి పరుగెత్తింది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోను లక్షమందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్ చేస్తూ తమదైనశైలిలో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.