Puppy’s Help: బామ్మకు కుక్క పిల్ల సాయం.. ఇలాంటి క్యూట్ క్యూట్ కుక్కపిల్ల ఒక్కటి ఉంటే చాలంటున్న నెటిజన్లు.. హార్ట్ వార్మింగ్ వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో ఓ బామ్మ గార్డెనింగ్‌ చేస్తుంది. అక్కడ ఓ బుజ్జి కుక్కపిల్ల కూర్చుని ఉంది. అయితే ఆ క్యూట్ క్యూట్ కుక్క పిల్ల.. బామ్మ ని చూసి.. వెంటనే కూర్చునేందుకు స్టూల్‌ను జరుపుతూ ఉంది.

Puppy's Help: బామ్మకు కుక్క పిల్ల సాయం.. ఇలాంటి క్యూట్ క్యూట్ కుక్కపిల్ల ఒక్కటి ఉంటే చాలంటున్న నెటిజన్లు.. హార్ట్ వార్మింగ్ వీడియో వైరల్
Puppy Love
Follow us
Surya Kala

|

Updated on: Oct 31, 2022 | 1:21 PM

మనుషులు కుక్క, పిల్లి వంటి జంతువులను ఇంట్లో పెంచుకున్నా.. కుక్కలతో రిలేషన్ వెరీ వెరీ స్పెషల్.  మనుషులకు మంచి స్నేహితుడిలా మెలగడంలో పెంపుడు కుక్కలు ఎప్పుడూ ముందుంటాయి. తమ యజమాని పట్ల అత్యంత విశ్వాసం కలిగి ఉంటాయి. అందుకనే కుక్కలను తమ కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమగా చూసేవారు చాలామంది ఉన్నారు. కుక్కలు కూడా తమ యజమాని పట్ల అత్యంత విశ్వాసం ప్రేమ కలిగి ఉంటాయి. తాజాగా ఓ వైరల్‌ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. ఇందులో ఓ చిన్న కుక్కపిల్ల బామ్మ పట్ల చూపించిన ప్రేమ ఎంతటి కఠిన హృదయం కలిగిన వారినైనా కదిలిస్తుంది. అంతేకాదు.. ప్రేమ, దయ లేని కొంతమంది పిల్లల కంటే.. ఇలాంటి ఒక కుక్క ఉన్నా చాలు అనిపిస్తుంది ఎవరికైనా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ బామ్మ గార్డెనింగ్‌ చేస్తుంది. అక్కడ ఓ బుజ్జి కుక్కపిల్ల కూర్చుని ఉంది. అయితే ఆ క్యూట్ క్యూట్ కుక్క పిల్ల.. బామ్మ ని చూసి.. వెంటనే కూర్చునేందుకు స్టూల్‌ను జరుపుతూ ఉంది. ఆ చిన్న కుక్కపిల్ల బామ్మ పట్ల చూపించిన ప్రేమ.. చేసిన సాయం.. విన్యాసం నెటిజన్లను ఫిదా చేస్తోంది. బామ్మ కూర్చునేందుకు కుర్చీ కోసం చూస్తుండటం పసిగట్టిన పప్పీ అక్కడే ఉన్న చిన్న స్టూల్‌ను ఆమె వైపు తోస్తుండటం ఈ క్లిప్‌లో కనిపించింది.

క్యూట్ క్యూట్ కుక్క పిల్ల ప్రేమ 

పప్పీ బామ్మ మనసుని కనిపెట్టిన వెంటనే స్పందించిన తీరు.. చూపించిన తెలివి తేటలు.. నెటిజన్లను ఫిదా చేసింది. వీడియోకు ఏకంగా 88 లక్షల వ్యూస్‌ లభించాయి. బుటెంగ్‌బిడిన్‌ ఈ క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేయగా పెద్దసంఖ్యలో యూజర్లు కామెంట్స్‌ చేశారు. ఈ కుక్క వృద్ధులకు అద్భుతమైన సేవలు అందించే శునకంగా ఎదుగుతుందని పలువురు.. హార్ట్ వార్మింగ్ అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి పప్పీ హృదయాన్ని అభినందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి