Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ప్రాణాలకు తెగించి మరీ అద్భుత ఫీల్డింగ్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం.. వీడియో చూస్తే మీరు కూడా..

AUS vs IRE: 20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 44 బంతుల్లో 63 పరుగులు చేశాడు.

Video: ప్రాణాలకు తెగించి మరీ అద్భుత ఫీల్డింగ్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం.. వీడియో చూస్తే మీరు కూడా..
Mccarthy Unbelievable Field
Follow us
Venkata Chari

|

Updated on: Oct 31, 2022 | 3:40 PM

టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. బ్రిస్బేన్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ చేస్తోంది. అయితే, 14 వ ఓవర్లో ఓ అద్భుతం జరిగింది. అప్పటికే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా టీం 113 పరుగులు చేసింది. క్రీజులో మార్కస్ స్టోయినీస్, ఆరోన్ ఫించ్ క్రీజులో ఉన్నారు. అయితే, మార్క్ ఐదర్ బౌలింగ్ చేస్తున్నాడు. భారీ బౌండరీ కోసం స్టోయినీస్ బంతిని బలంగా కొట్టేశాడు. ఇక బౌండరీ లైన్ వద్ద ఫీల్డిండ్ చేస్తున్న మెక్‌కార్తీ తన అద్భుత ఫీల్డింగ్‌తో అందర్నీ మెప్పించాడు. ఏకంగా ప్రాణాలకు తెగించి, బౌండరీని ఆపేశాడు. దీంతో ప్రత్యర్థి ఆటగాళ్లే కాదు.. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా జోహార్లు చేశారు. అయితే, ఈ క్రమంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ వీడియో మీరు కూడా చూడండి..

బౌండరీని ఆపేందుకు పరిగెత్తుకుంటూ వచ్చిన మెక్ కార్తీ.. అమాతం గాల్లోకి జంప్ చేసి బాల్‌ను క్యాచ్ అందుకున్నాడు. అయితే, బౌండరీ అవతల పడేలా ఉండడంతో, బంతనికి వెనకకు విసిరేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బలంగా కిందపపడంతో కొద్దిగా దెబ్బతగిలినట్లైంది. ఆ తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, మరలా ఫీల్డింగ్‌కు వచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మెక్ కార్తీ అటు ఫీల్డింగ్‌తోనే కాదు.. ఇటు బౌలింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ICC (@icc)

గాయపడిన మెక్ కార్తీ..

మెక్‌కార్తీ తన అత్యుత్తమ ఫీల్డింగ్‌లో గాయపడ్డాడు. వీపుపై అమాంతం పడిపోయాడు. తరువాత చాలా నొప్పితో బాధపడ్డాడు. ఆ తరువాత, ఐరిష్ ఫిజియో వెంటనే అతనిని చేరుకున్నాడు. ఈ సమయంలో ఈ ఆటగాడు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడ్డాడు.

మ్యాచ్ విషయానికి వస్తే..

20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 44 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఐర్లాండ్ ఆటగాడు బారీ మెక్‌కార్తీ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

ఇరుజట్లు..

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (సి), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికె), పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ (సి), లోర్కాన్ టక్కర్ (వారం), హ్యారీ టెక్టర్, కర్టిస్ క్యాంపర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, ఫిన్ హ్యాండ్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్.

ఈ పండు ప్రత్యేకతలేంటో తెలుసా.?లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
ఈ పండు ప్రత్యేకతలేంటో తెలుసా.?లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
వైసీపీ అధినేత జగన్‌ సెక్యూరిటీపై రాజుకున్న రచ్చ..
వైసీపీ అధినేత జగన్‌ సెక్యూరిటీపై రాజుకున్న రచ్చ..
తమపై తప్పుడు ప్రచారం చేశాడని..ఫ్రెండ్‌ను ఏం చేశారో చూడండి?
తమపై తప్పుడు ప్రచారం చేశాడని..ఫ్రెండ్‌ను ఏం చేశారో చూడండి?
మరోసారి పోలీస్ స్టేషన్‏కు చేరిన మంచు పంచాయితీ..
మరోసారి పోలీస్ స్టేషన్‏కు చేరిన మంచు పంచాయితీ..
ఈ ఆకులు వేస్ట్‌ అని పడేస్తున్నారా..? బెస్ట్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఈ ఆకులు వేస్ట్‌ అని పడేస్తున్నారా..? బెస్ట్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
భారత్‌లో పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లీవర్‌ బాధితులు
భారత్‌లో పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లీవర్‌ బాధితులు
నరసింహాలో నీలాంబరి పాత్ర.. ఆమెను చూసి రాశానని చెప్పిన డైరెక్టర్..
నరసింహాలో నీలాంబరి పాత్ర.. ఆమెను చూసి రాశానని చెప్పిన డైరెక్టర్..
P-4 సొసైటీ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు, వైఎస్ చైర్మన్‌గా పవన్..
P-4 సొసైటీ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు, వైఎస్ చైర్మన్‌గా పవన్..
తండ్రికి క్యాన్సర్.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్..
తండ్రికి క్యాన్సర్.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్..
ఛార్జీల బాదుడు.. మీరు ATM నుంచి విత్‌డ్రా చేస్తున్నారా?
ఛార్జీల బాదుడు.. మీరు ATM నుంచి విత్‌డ్రా చేస్తున్నారా?