ల్యాప్ టాప్ ఎత్తుకెళ్లిన దొంగ.. సారీ భయ్యా అంటూ ఓనర్‌కి ట్విస్ట్..!..ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇది నిజంగా అభినందనీయం. ల్యాప్‌టాప్‌తో ఉద్యోగం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మరొకరు చెప్పారు. ఈ వ్యక్తికి డబ్బు అవసరం. కానీ చెడు పనులు చేయాలని కాదు అంటూ నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
ల్యాప్‌టాప్ పొగొట్టుకున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. తన ల్యాప్‌ట్యాప్ పోయిందనే భాదలో ఉన్న ఆ వ్యక్తికి సదరు దొంగ ఈమెయిల్ చేశాడు. ఈ మేరకు ల్యాప్‌టాప్ యజమాని జ్వెల్లీ థిక్సో అనే ట్విట్టర్ ఖాతాదారుడు దొంగ పంపిన ఇమెయిల్ స్క్రీన్‌షాట్ తీసి ట్వీట్ చేశాడు.. ఆదివారం రోజున తన ల్యాప్‌టాప్‌ని దొంగ ఎత్తుకెళ్లినట్టుగా వివరించాడు. అలాగే, ఆ దొంగ తనకు ఇమెయిల్ నుండి పంపిన సందేశాన్ని వివరించారు. ఈ మేరకు.. ‘అన్నా, బతకడానికి డబ్బు కావాలి. అందుకే నిన్న నీ ల్యాప్‌టాప్ దొంగిలించాను. కానీ మీరు పరిశోధన ప్రతిపాదనలో ప్రమేయం ఉన్నట్లు తెలుసుకున్నాను. అందుకే నేను ఆ ఫైల్‌ను మీకు పంపించాను దీనికి సంబంధించిన ఏవైనా అవసరమైన ఫైల్స్ ఉంటే గనుక సోమవారం మధ్యాహ్నం 12 గంటలలోపు నాకు తెలియజేయండి. ఎందుకంటే ఈ ల్యాప్‌టాప్‌ను ఎవరికి విక్రయించాలనేది ఇప్పటికే నిర్ణయించుకున్నాను. నన్ను క్షమించండి…అని దొంగ చేసిన మెయిల్‌లో రాసివుంది.
దీంతో లాప్ టాప్ పోయినందుకు బాధపడాలో లేక కష్టపడి చేసిన పరిశోధనకు సంబంధించిన ఫైల్స్ దక్కినందుకు సంతోషపడాలో తెలియట్లేదని ఆ యువకుడు ట్విట్ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దొంగతనం చేస్తే చేశాడు కానీ విలువైన ఫైల్స్ పంపించాడు, ఎంతైనా మంచి దొంగేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
They stole my laptop last night and they sent me an email using my email, I have mixed emotions now.? pic.twitter.com/pYt6TVbV1J
— GOD GULUVA (@Zweli_Thixo) October 30, 2022
మరోవైపు ఈ దొంగపై నెటిజన్లు సైతం సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇదే ల్యాప్‌టాప్‌ని ఈ దొంగకు ఎందుకు బహుమతిగా ఇవ్వకూడదు? అని ఒకరు అన్నారు. దయచేసి ఎవరైనా ఈ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వగలరా? అన్నాడు మరోవ్యక్తి. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. చదువు ప్రాముఖ్యత గురించి కూడా తెలుసు కాబట్టి నిజాయితీపరుడు. ఇది నిజంగా అభినందనీయం. ల్యాప్‌టాప్‌తో ఉద్యోగం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మరొకరు చెప్పారు. ఈ వ్యక్తికి డబ్బు అవసరం. కానీ చెడు పనులు చేయాలని కాదు అంటూ నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. పరిశోధన కష్టాల గురించి ఆయనకు తెలుసు. అతను నిజాయితీ మరియు నిబద్ధత రెండూ ఉన్న వ్యక్తి. నైతికత కోల్పోలేదని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి