Newly Wed Bride: ఫస్ట్ నైట్ రోజే షాకిచ్చిన నవ వధువు.. లబోదిబోమంటూ భర్త.. ఏం చేసిందంటే..?
ఉత్తరప్రదేశ్‌లోని బిల్హర్ జిల్లా జదేపూర్ గ్రామానికి చెందిన అరవింద్ అనే వ్యక్తిని ఇటీవల ఇద్దరు వ్యక్తులు కలిశారు. ఆ ఇద్దరూ పెళ్లి కుదిరిస్తామని అతడ్ని నమ్మించారు. అందుకు గాను అరవింద్ దగ్గరనుంచి 70 వేల రూపాయలు కూడా తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని బిల్హర్ జిల్లా జదేపూర్ గ్రామానికి చెందిన అరవింద్ అనే వ్యక్తిని ఇటీవల ఇద్దరు వ్యక్తులు కలిశారు. ఆ ఇద్దరూ పెళ్లి కుదిరిస్తామని అతడ్ని నమ్మించారు. అందుకు గాను అరవింద్ దగ్గరనుంచి 70 వేల రూపాయలు కూడా తీసుకున్నారు. చెప్పినట్లుగానే రుచి అనే ఓ అమ్మాయిని చూసారు. అనంతరం అరవింద్‌ను గయాకు తీసుకెళ్లి అక్టోబర్ 1వ తేదీన ఆ యువతితో వివాహం జరిపించారు. అక్టోబర్ 3వ తేదీన అరవింద్ తన భార్యను ఇంటికి తీసుకొచ్చాడు . ఇక ఆ తర్వాత రోజు ఉదయం లేచేసరికి తన భార్య కనిపించకుండా పోయింది. అంతేకాదు ఇంట్లోని 30 వేల నగదు, బంగారు ఆభరణాలు, పెళ్లి బట్టలు ఏమీ కనబడలేదు. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అరవింద్ నిర్ధారణకు వచ్చాడు.ఎంతో నమ్మకంతో ఇంటికి తెచ్చుకున్న భార్య షాక్ ఇవ్వడంతో ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డాడు అరవింద్. ఇంతలోనే అతడికి రుచి ఫోన్ చేసి.. ‘తనకోసం వెతకొద్దని.. తనకు ఇంకెప్పుడూ ఫోన్ చేయొద్దంటూ’ చెప్పింది. దీంతో తాను నిండా మోసపోయాయని అరవింద్‌కు అర్ధమై.. పోలీసులను ఆశ్రయించాడు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ యువతితో సహా పెళ్లి కుదిర్చిన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
ఓర్నీ ఏందిరా ఇదీ.. ఇంకెక్కడా చోటు దొరకలేదా నీకు!
పాముకు చేత్తో ఆహారం పెట్టాడు !! కట్ చేస్తే.. చేతి వేలు కాస్తా..
ఎంతైనా అమ్మ.. అమ్మే.. ఇంటికొచ్చిన కొడుక్కి వెరైటీ వెల్కమ్..
పదేళ్ల ప్రార్థనల ఫలం.. ఆ చిన్నారి ఆరు నెలలకే అనంత లోకాలకు
జస్ట్ రూ.600కే చీర.. ఎగబడిన మహిళలు
గంటకు 10 కి.మీ వేగం.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిన రైలు
2026 భయానకం.. నోస్ట్రడామస్ జోస్యం

