AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో విషాద సంఘటన.. మట్టి కుప్ప కూలి ఇద్దరు బాలికలు మృతి.. తల్లిదండ్రుల రోదన..

అయితే, బాలికల అరుపులు విన్న స్థానికులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు బాలికలను రక్షించగలిగారు. ఊపిరాడక ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన నలుగురిని

మరో విషాద సంఘటన.. మట్టి కుప్ప కూలి ఇద్దరు బాలికలు మృతి.. తల్లిదండ్రుల రోదన..
death
Jyothi Gadda
|

Updated on: Oct 31, 2022 | 8:33 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. భిరా కొత్వాలి పరిధిలోని ధాకియా గ్రామంలో శారదా నది ఒడ్డున వదులుగా ఉన్న మట్టి కుప్ప కూలిపోవడంతో ఇద్దరు బాలికలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతులను 12 ఏళ్ల పూనమ్ దేవి, 13 ఏళ్ల శివానిగా గుర్తించారు. శిథిలాల కింద కూరుకుపోయిన మరో ముగ్గురు బాలికలు నిక్కీ, నైరా, నైన్సీలను స్థానికులు రక్షించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు భిరా కొత్వాలి ఇన్‌ఛార్జ్ విమల్ కుమార్ గౌతమ్ తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఐదుగురు బాలికలు మట్టి సేకరించేందుకు శారదా నదికి వెళ్లారు.

శారదా నది గ్రామంలోని నివాస ప్రాంతం నుండి వంద మీటర్ల దూరంలో ప్రవహిస్తుంది. ఈ బాలికలందరూ నది ఒడ్డుకు సమీపంలో ఉన్న స్థలాన్ని ఎంచుకుని మట్టిని తవ్వడం ప్రారంభించిన సమయంలో మట్టి కూలిపోయి ఈ దుర్ఘటన జరిగింది. అకస్మాత్తుగా బురద పడి ఇద్దరు బాలికలు మరణించారు.

అయితే, బాలికల అరుపులు విన్న స్థానికులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు బాలికలను రక్షించగలిగారు. ఊపిరాడక పూనమ్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన నలుగురిని వెంటనే బిజువాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. చికిత్స పొందుతూ శివాని కూడా మృతి చెందింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే