మోర్బీ దుర్ఘటనలో మృత్యుంజయుడు..! ప్రాణాలతో బయటపడ్డ 4 ఏళ్ల బాలుడు.. తల్లిదండ్రులు మృతి

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Oct 31, 2022 | 8:33 AM

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించగా, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

మోర్బీ దుర్ఘటనలో మృత్యుంజయుడు..! ప్రాణాలతో బయటపడ్డ 4 ఏళ్ల బాలుడు.. తల్లిదండ్రులు మృతి
Morbi Cable Bridge Collapse

Follow us on

మోర్బీ వంతెన కూలిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వంతెనపై జనం రెట్టింపు సామర్థ్యంతో ఉన్నందున అది కూలిపోయిందని చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం వంతెనపై 400 నుంచి 500 మంది పర్యాటకులు ఉండగా కేబుల్ వంతెన కూలిపోయింది. దీంతో దాదాపుగా 100 మందికి పైగా మరణించారు. కానీ. అద్భుతంగా ఓ నాలుగేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో బాలుడి తల్లిదండ్రులు మృతి చెందడం విచారకరం. ఉమా టౌన్‌షిప్ నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం, వారి పొరుగువారు హార్దిక్ ఫల్దు, అతని భార్య మిరల్‌బెన్, నాలుగేళ్ల కుమారుడు జియాన్ష్, హార్దిక్ బంధువు హర్ష్ జలవాడియా మరియు అతని భార్య కేబుల్ వంతెనను సందర్శించడానికి వెళ్లారు.ఈ ప్రమాదంలో హార్దిక్, అతని భార్య మీరాల్ చనిపోయారు. కానీ, జియాన్ష్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. జియాన్ష్‌కి అతని మామ హర్ష్ కూడా ఉన్నాడు. గాయపడిన మామ హర్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రమాదంలో హర్ష భార్య కూడా మృతి చెందింది. హార్దిక్‌ హలవాడ పట్టణానికి చెందినవాడని, సోమవారం పట్టణంలో బంద్‌ పాటిస్తున్న దృష్ట్యా మృతుల కుటుంబ సభ్యుల మృతదేహాన్ని హలవాడకు తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఉమా పట్టణ వాసి తెలిపారు.

వంతెన కూలిపోవడంతో నదిలో పడిన వారిని రక్షించేందుకు అధికారులు స్థానిక ప్రజల సహకారంతో ప్రయత్నించారు. తర్వాత ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఇతర సహాయక బృందాలను హుటాహుటిన ఘటన స్థలానికి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 200 మందికిపైగా రక్షించారు. మరణించే వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జరిగిన ఘటనపై సీఎం భూపేంద్ర పటేల్ ట్వీట్ చేస్తూ, మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, అలాగే గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రధాని మోడీ ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని గాంధీనగర్‌కు చేరుకుంటున్నట్లు సీఎం పటేల్ తెలిపారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలకు మార్గనిర్దేశం చేయాలని రాష్ట్ర హోంమంత్రిని కోరారు.

కాగా, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించగా, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu