విషాదాంతం.. మోర్బీ వంతెన ప్రమాదంలో 12 మంది బంధువులను కోల్పోయిన బీజేపీ ఎంపీ..

గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి కూడా మోర్బీలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని.. ఈరోజు రేంజ్ ఐజీపీ నేతృత్వంలో విచారణ ప్రారంభించామని తెలిపారు.

విషాదాంతం.. మోర్బీ వంతెన ప్రమాదంలో 12 మంది బంధువులను కోల్పోయిన బీజేపీ ఎంపీ..
Morbi Suspension Bridge
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 31, 2022 | 10:38 AM

గుజరాత్‌లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం సంభవించిన మోర్బి కేబుల్ వంతెన కూలిన ప్రమాదంలో ఇప్పటివరకు 141 మందికి పైగా మరణించినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. అయితే స్థానికుల సమాచారం ప్రకారం 180 మందికి పైగా మరణించారు. అంతే కాదు ఈ విషాదంలో బీజేపీ ఎంపీ 12 మంది బంధువులను కోల్పోయారు. ఈ దుర్ఘటనపై రాజ్‌కోట్‌ బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్‌ కుందారియా మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి ఇక్కడే ఉన్నాను. ఇప్పటి వరకు వందల సంఖ్యలో మృతదేహాలను వెలికి తీశారు. ఈ విపత్తులో మా బంధువులు కూడా చనిపోయారు. నా బావ నలుగురు కుమార్తెలు, ముగ్గురు కోడళ్లు, 5 మంది పిల్లలను కోల్పోయినట్టుగా చెప్పారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ ప్రమాదంలో నిజం 100% బయటకు వస్తుందన్నారు. ప్రధాని మోదీ కూడా ఈ అంశంపై నిరంతరం నిఘా పెడుతున్నారు. దీనిపై రాత్రంతా ఫోన్ లో సమాచారం అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు.

ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భారత హైకమిషనర్ సైమన్ వాంగ్ సంతాపం తెలిపారు. గుజరాత్‌లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి, సహాయక చర్యలకు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని ప్రకటించారు ప్రధాని మోడీ. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి కూడా మోర్బీలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని.. ఈరోజు రేంజ్ ఐజీపీ నేతృత్వంలో విచారణ ప్రారంభించామని తెలిపారు.

విషాదాంతం.. మోర్బీ వంతెన ప్రమాదంలో 12 మంది బంధువులను కోల్పోయిన బీజేపీ ఎంపీ..

కాగా, గుజరాత్, రాజస్థాన్‌లలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, మోర్బీ కేబుల్ వంతెన కూలిన ఘటన నేపథ్యంలో సోమవారం అహ్మదాబాద్‌లో జరగాల్సిన రోడ్‌షోను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. మోర్బీ వంతెన వందేళ్ల పురాతనమైనది దీన్ని ఐదు రోజుల క్రితమే.. విస్తృత మరమ్మతులు, పునరుద్ధరణల తర్వాత తిరిగి తెరిచారు. ఈ వంతెన ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు కూలిపోయింది. ఆ సమయంలో వంతెన మీద జనం కిక్కిరిసి ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి