American Boeing Company: భారత్‌ కు ఎఫ్‌-15 ఈఎక్స్‌ ఫైటర్‌ జెట్లు‌ అందించేందుకు అమెరికా అంగీకారం

American Boeing Company: తన సరికొత్త భారీ యుద్ధ విమానం ఎఫ్ -15 ఎక్స్‌ను భారత్ లో మార్కెట్ చేయడానికి లైసెన్స్ మంజూరు చేసినట్లు అమెరికాకు చెందిన బోయింగ్ ..

American Boeing Company: భారత్‌ కు ఎఫ్‌-15 ఈఎక్స్‌ ఫైటర్‌ జెట్లు‌ అందించేందుకు అమెరికా అంగీకారం
Follow us
Subhash Goud

|

Updated on: Jan 31, 2021 | 1:15 AM

American Boeing Company: తన సరికొత్త భారీ యుద్ధ విమానం ఎఫ్ -15 ఎక్స్‌ను భారత్ లో మార్కెట్ చేయడానికి లైసెన్స్ మంజూరు చేసినట్లు అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ వెల్లడించింది. కనీసం 114 మీడియం ఫైటర్లను కొనాలని నిర్ణయించిన భారతీయ వైమానిక దళం.. ఇందు కోసం 20-30 బిలియన్‌ డాలర్లు కేటాయించాలని నిర్ణయించింది. దీనిపై ఆసక్తి కనబరచిన ఏడు యుద్ధ విమాన తయారీ కంపెనీలు 2019లో ఐఏఎఫ్‌ ఇన్ఫర్మేషన్ ఫర్ రిక్వెస్ట్ జారీ చేసింది.

1. బోయింగ్ కంపెనీ – ఎఫ్‌ / ఏ-18ఈ/ఎఫ్‌ సూపర్ హార్నెట్‌ విమానం 2. లాక్హీడ్ మార్టిన్ కంపెనీ – సింగిల్ ఇంజిన్ ఎఫ్‌-21 విమానం 3. శాబ్‌ కంపెనీ – సింగిల్ ఇంజిన్ గ్రిపెన్ ఇ/ఎఫ్‌ విమానం 4. డసాల్ట్ కంపెనీ – ట్విన్ ఇంజిన్ రాఫేల్‌ విమానం 5. యూరోఫైటర్ జిఎమ్‌బిహెచ్ కంపెనీ – ట్విన్ ఇంజన్ టైఫూన్‌ విమానం 6. రష్యా కు చెందిన రెండు ట్విన్ ఇంజన్ ఫైటర్లతో ఆర్‌ఐసి మిగ్ -35 విమానం 7. సుఖోయ్ సు-35 విమానాలు

గతంలో ఆఫర్‌ చేసిన సూపర్ హార్నెట్‌ విమానం.. తాజాగా ఎఫ్‌-15ఈఎక్స్‌ను ఆఫర్ చేసింది బోయింగ్ కంపెనీ. భారత వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా ఏదో ఒక విమానాన్ని ఫైనల్‌ రేసులో పెట్టనుంది. భారతీయ వైమానిక దళంఎఫ్‌-15ఈఎక్స్‌ను ఎంపిక చేసుకుంటే… భారత నావికాదళం కోసం ఎఫ్‌ / ఏ-18ఈ/ఎఫ్‌ సూపర్ హార్నెట్‌ అమ్మే ప్రతిపాదలో ఉంది. తన ఎయిర్‌క్రాఫ్ట్‌ కేరియర్‌ యుద్దనౌకల కోసం ప్రత్యేకంగా 57 యుద్ద విమానాలను కొనుగోలు చేయాలని భారత నావికాదళం భావిస్తోంది. ఇప్పటికే సూపర్ హార్నెట్‌ను నావికాదళ, క్యారియర్-డెక్ ఫైటర్‌గా అమెరికా మిలటరీ ఉపయోగిస్తోంది. అయితే ఆస్ట్రేలియా వంటి దేశాలకు మాత్రం భూ-ఆధారిత యుద్ధ విమానంగానే విక్రయించింది.

ఎఫ్‌-15 ఈఎక్స్‌ ఫైటర్‌ జెట్‌ సమర్ధత, ఎఫ్ -15 ఈగిల్ పేరుతో నాలుగు దశాబ్దాల క్రితమే యుఎస్ ఎయిర్ ఫోర్స్‌ లో ప్రవేశం జరిగింది. అత్యాధునికంగా ఉండటానికి నిరంతరం అప్‌గ్రేడ్ చేపడుతోన్న ఈ ఎప్‌-15 రకం విమానం.. ఎఫ్ -15 ప్లాట్‌ఫామ్‌పై యుఎస్‌ఎఎఫ్ కు అత్యంత విశ్వాసం. జూలై 2020 లో బోయింగ్‌ కంపెనీ నుంచి ఈ ఆధునిక ఎఫ్‌-15 ఈఎక్స్‌ విమానాల కొనుగోలు చేయాలని నిర్ణయించిన అమెరికా ఎయిర్‌ఫోర్స్‌.. 23 బిలియన్‌ డాలర్ల కేటాయింపు, 144 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని బట్టి వీటి నిలకడ, అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లు కనీసం మరో మూడు దశాబ్దాలు కొనసాగవచ్చు.

ఎఫ్ -15 ఈగిల్ తరహా విమానాలు ఇప్పటికే ఇజ్రాయెల్ సహా అనేక దేశాల వైమానిక దళాల్లో సేవలు అందిస్తున్నాయి. బలమైన గాలుల వాతావరణంలో కూడా మంచి పోరాట రికార్డు కలిగి ఉంది. స్ట్రైక్ ఈగిల్ అనే గ్రౌండ్ స్ట్రైక్ వెర్షన్‌ను బోయింగ్‌ సంస్థ అభివృద్ధి చేసింది. ఇప్పుడు కొత్త కాక్‌పిట్, యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే (AESA)రాడార్, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్, ఫ్యూజ్డ్ సెన్సార్లు, డేటా లింక్‌లతో కూడిన పూర్తి స్థాయి మిషన్ల సామర్థ్యం కలిగిన ఉన్నాయి. బహుళ-పాత్ర ఫైటర్‌గా మార్చబడిన అడ్వాన్స్‌డ్‌ ఫైటర్‌ జెట్‌ గా ఎఫ్‌-15 ఈఎక్స్‌ అందిస్తోంది.

ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండే మాక్ 2.5 ఎఫ్ -15 యొక్క ఏరో డైనమిక్స్, ఎఫ్‌-15 ఈఎక్స్‌ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన యుద్ధ విమానంగా పేరుంది. అత్యంత వేగంగా ప్రయాణించగలదు. ఇది 13.5 టన్నుల ఆయుధాలను మోసుకెళ్లగలదు సామర్థ్యం ఉంది. అంటే రాఫల్‌ లేదా సుఖోయ్ -30 ఎంకెఐ కంటే ఎక్కువ బరువు మోయగల సామర్ధ్యం కలిగి ఉంది. దీని పరిధి 1,200 నాటికల్ మైళ్ళు (2,200 కిలోమీటర్లు). శత్రు భూభాగం లోపల లోతైన లక్ష్యాలను చేధించే సత్తా ఉంది.

అయితే అమెరికా బడ్జెట్ గణాంకాల ప్రకారం.. ఒక్కో ఎఫ్-15 ఎక్స్ ఫైటర్‌ తయారీకి 80.3 మిలియన్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఈ విమానాన్ని ఇక్కడే నిర్మించాలని కోరుకుంటున్న భారత్.. కొత్త కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం, కార్మికులకు శిక్షణ ఇవ్వడంతో ఖర్చును ధర పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద బోయింగ్ రక్షణ వినియోగదారులలో భారతదేశం ఒకటి. భారత్‌ ఇప్పటికే బోయింగ్‌ కంపెనీకి చెందిన… 11 సి -17 గ్లోబ్‌మాస్టర్ III రవాణా విమానాలను, తొమ్మిది పి -8 ఐ పోసిడాన్ మారిటైమ్ పెట్రోల్ విమానాలను మరో మూడు ఆర్డర్‌లతో, 22 ఎహెచ్ -64 ఇ అపాచీ అటాక్ హెలికాప్టర్లను వాడుతోంది. మరో ఆరు 15 సిహెచ్ -47 ఎఫ్ చినూక్స్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లను ఆర్డర్లు చేసింది. బోయింగ్ విమానాల మరమ్మతు, అభివృద్ధి కోసం ఇటీవలే ఇండియాలో (BIRDS) హబ్‌ను కూడా ప్రారంభమైంది.

train Virus: యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పరీక్షల్లో నెగెటివ్‌ తేలితే..