Strain Virus: యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పరీక్షల్లో నెగెటివ్‌ తేలితే..

Strain virus: ఒక వైపు కరోనా మహమ్మారి పూర్తిగా కట్టడిలోకి రాకముందే యూకే కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్‌ మరింత భయాందోళనకు గురి చేస్తోంది. యూకే నుంచి వచ్చే ...

Strain Virus: యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పరీక్షల్లో నెగెటివ్‌ తేలితే..
Follow us

|

Updated on: Jan 30, 2021 | 11:05 PM

Strain Virus: ఒక వైపు కరోనా మహమ్మారి పూర్తిగా కట్టడిలోకి రాకముందే యూకే కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్‌ మరింత భయాందోళనకు గురి చేస్తోంది. యూకే నుంచి వచ్చే ప్రయాణికులను ఉద్దేశించి ఢిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బ్రిటన్‌ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమనాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు కోవిడ్‌-19 పరీక్షల్లో నెగెటివ్‌ వస్తే వారికి ఇన్‌స్టిట్యూషన్‌ క్వారంటైన్‌ అవసరం లేదని  స్పష్టం చేసింది. 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంటే సరిపోతుందని తెలిపింది. గత డిసెంబర్‌లో యూకేలో కొత్తరకం కరోనా వైరస్‌ బయటపడిన విషయం తెలిసిందే. ఈ వైరస్‌ కోవిడ్‌-19 కంటే 70 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు వెల్లడించారు.

ఈ క్రమంలో యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూకే నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు చేసి పాజిటివ్‌ వచ్చిన వారిని ఐసోలేషన్‌కు పంపింది. అంతేకాకుండా నెగెటివ్‌ వచ్చిన వారిని ఏడు రోజుల పాటు ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌కు పంపి ఆ తర్వాత ఏడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఈ నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం సడలించింది.

local trains: ఆ రాష్ట్రంలో ప్రారంభంకానున్న లోక‌ల్ ట్రైన్లు.. ఎప్ప‌టి నుంచి న‌డ‌వ‌నున్నాయంటే?సాధార‌ణ ప్ర‌యాణికుల అనుమ‌తి అప్ప‌టి నుంచే

Latest Articles
'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు..
'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు..
సోంపు తినడం కాదు.. ఇలా వాటర్‌లో కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?
సోంపు తినడం కాదు.. ఇలా వాటర్‌లో కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?
సన్‌రైజర్స్ vs లక్నో మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి..?
సన్‌రైజర్స్ vs లక్నో మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి..?
వాటిని గమనించే ప్రజలు తీర్పు ఇస్తారు.. విపక్ష కూటమిపై అవంతి ఫైర్
వాటిని గమనించే ప్రజలు తీర్పు ఇస్తారు.. విపక్ష కూటమిపై అవంతి ఫైర్
ఈ సమ్మర్‌లో ఈ గింజలు తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..
ఈ సమ్మర్‌లో ఈ గింజలు తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..
కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్నంటే.. కోమటి రెడ్డి లెక్క ఇదే..
కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్నంటే.. కోమటి రెడ్డి లెక్క ఇదే..
డయాబెటిస్‌ రోగులకు దివ్యాస్త్రం ఈ పండు.. చెక్ పెట్టాలంటే..
డయాబెటిస్‌ రోగులకు దివ్యాస్త్రం ఈ పండు.. చెక్ పెట్టాలంటే..
అజీర్తికి మామిడిపండుతో చెక్.. తేల్చిన పరిశోధన
అజీర్తికి మామిడిపండుతో చెక్.. తేల్చిన పరిశోధన
మాజీ ప్రేయసి ఇంటికి బాంబు పార్సిల్‌ ను పంపిన ప్రియుడు..
మాజీ ప్రేయసి ఇంటికి బాంబు పార్సిల్‌ ను పంపిన ప్రియుడు..
అందం ఈ బ్యూటీని చూస్తే మనువాడి తనతో తీసుకుపోతుందేమో..
అందం ఈ బ్యూటీని చూస్తే మనువాడి తనతో తీసుకుపోతుందేమో..