మహారాష్ట్రలో షాకింగ్ ఘటన.. కమోడ్ లో పాము బుసలు
సాధారణంగా ఎవరైనా పాము కనబడితే భయమేసి ఆమడ దూరం పరిగెడతారు. ఇక సోఫాలోనో, బూటు లోపలో పాము కనిపిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఏకంగా బాత్రూంకు వెళ్లినప్పుడు కమోడ్ లో పాము బుసలు కొడుతున్న చప్పుడు వినిపిస్తే..!! మహారాష్ట్రలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన ఇంట్లో బాత్రూంకు వెళ్లగా కమోడ్ లోపల నుంచి పాము బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. అయితే ముందు అతను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
సాధారణంగా ఎవరైనా పాము కనబడితే భయమేసి ఆమడ దూరం పరిగెడతారు. ఇక సోఫాలోనో, బూటు లోపలో పాము కనిపిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఏకంగా బాత్రూంకు వెళ్లినప్పుడు కమోడ్ లో పాము బుసలు కొడుతున్న చప్పుడు వినిపిస్తే..!! మహారాష్ట్రలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన ఇంట్లో బాత్రూంకు వెళ్లగా కమోడ్ లోపల నుంచి పాము బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. అయితే ముందు అతను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పైప్ లైన్ ఏమైనా లీక్ కావడం వల్లో లేదా పైప్ లైన్ లో ఏమైనా చెత్త ఇరుక్కోవడం వల్లో ఆ శబ్దం వస్తోందని భావించాడు. కానీ ఆగకుండా శబ్దం వస్తుండటంతో టాయ్ లెట్ సీట్ కిందకు తొంగి చూశాడు. అంతే.. ఒక్కసారిగా అతని గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే.. లోపల నుంచి ఓ పెద్ద పాము అతన్ని చూస్తూ బసలు కొడుతోంది. దీంతో ఒక్క ఉదుటున పైకి లేచి అతను బయటకు పరుగు తీశాడు. పాములు పట్టడంలో పేరున్న షీతల్ కాసర్ అనే యువతికి వెంటనే ఫోన్ చేశాడు. ఆమె వచ్చి 10 అడుగుల పొడవున్న ఆ పామును జాగ్రత్తగా బయటకు తీసింది. దాన్ని చేత్తో పట్టుకొని ఇంట్లోంచి బయటకు తీసుకెళ్లింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందమైన అమ్మాయిల చెమట తో కలిపి స్నాక్స్ తయారీ.. అదరహో అంటున్న కస్టమర్స్
దారుణం.. సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ వెలుగులో ప్రసవం..
మీసం, గడ్డం పెంచారని 80 మందిని ఉద్యోగం నుంచి తీసేశారు
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్

