దారుణం.. సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ వెలుగులో ప్రసవం..

ముంబయిలో ఓ ఆసుపత్రి నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చిమ్మ చీకట్లో సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ వెలుగులో డాక్టర్లు చేసిన సిజేరియన్ ఆ కుటుంబాన్ని విషాదంలో నెట్టేసింది. కాసులు గలగలలాడే బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖస్రుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి ఇటీవల నిండు గర్భిణీగా ఉన్న తన భార్యను సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హోంలో చేర్పించారు.

దారుణం.. సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ వెలుగులో ప్రసవం..

|

Updated on: May 08, 2024 | 1:11 PM

ముంబయిలో ఓ ఆసుపత్రి నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చిమ్మ చీకట్లో సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ వెలుగులో డాక్టర్లు చేసిన సిజేరియన్ ఆ కుటుంబాన్ని విషాదంలో నెట్టేసింది. కాసులు గలగలలాడే బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖస్రుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి ఇటీవల నిండు గర్భిణీగా ఉన్న తన భార్యను సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హోంలో చేర్పించారు. కరెంట్‌ పోయినా.. ఇతర ఏర్పాట్లు చేయకుండానే టార్చ్‌లైట్‌ వేసి, వైద్యులు ఆపరేషన్ చేశారని, దాంతో తల్లీబిడ్డ మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రికి తీసుకువచ్చేప్పుడు తన కోడలికి ఎలాటి ఆరోగ్య సమస్యలు లేవని ఏప్రిల్‌ 29న ఉదయం ఏడు గంటలకు డెలివరీ వార్డుకు తరలించారనీ… రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంచారనీ అన్సారీ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉందని, సహజ కాన్పు అవుతుందని వైద్యులు తొలుత చెప్పారనీ.. అప్పుడు ఆమెను చూడటానికి వెళ్తే.. రక్తపు మడుగులో కనిపించిందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీసం, గడ్డం పెంచారని 80 మందిని ఉద్యోగం నుంచి తీసేశారు

బరువు తగ్గాలంటే మ్యూజ్లీనా.. ఓట్సా ?? ఏది బెస్ట్‌ ??

రూ. 23 లక్షల వజ్రాల చెవి కమ్మలు.. 2,300కే కొనే ఛాన్సొస్తే

కదులుతున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్‌ చెప్పి ప‌రారైన‌ భర్త

జూపిటర్‌ ఉపగ్రహంపై భారీ టవర్‌.. గుర్తించిన నాసా జునో స్పేస్‌ క్రాఫ్ట్‌

Follow us