AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: డయాబెటిస్‌ రోగులకు దివ్యాస్త్రం ఈ పండు.. ఇలా తీసుకుంటే మహమ్మారికి చెక్ పెట్టినట్లే..

భారతదేశంలో మధుమేహం కేసులు నానాటికి పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. ముఖ్యంగా పేలవమైన జీవనశైలి, అనారోగ్యరమైన ఆహారం వల్ల డయాబెటిస్ కేసులు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

Diabetes: డయాబెటిస్‌ రోగులకు దివ్యాస్త్రం ఈ పండు.. ఇలా తీసుకుంటే మహమ్మారికి చెక్ పెట్టినట్లే..
Gooseberry Benefits
Shaik Madar Saheb
|

Updated on: May 08, 2024 | 1:21 PM

Share

భారతదేశంలో మధుమేహం కేసులు నానాటికి పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. ముఖ్యంగా పేలవమైన జీవనశైలి, అనారోగ్యరమైన ఆహారం వల్ల డయాబెటిస్ కేసులు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. వాస్తవానికి డయాబెటిస్ మహమ్మారికి నియంత్రణ తప్ప సరైన మందు అంటూ ఏం లేదు. కావున డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న రక్తంలో చక్కెర పరిమాణం పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవడం చాలాముఖ్యం.. వాస్తవానికి.. ఈ సమస్య ఉన్న వారి శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించదు లేదా అవసరమైన దానికంటే తక్కువగా విడుదల అవుతుంది. దీని కారణంగా, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీనినే మధుమేహం (డయాబెటిస్) అంటారు.

అయితే, కొన్ని ఇంటి నివారణలతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.. అలాంటి వాటిలో ఉసిరికాయ ఒకటి.. ఉసిరిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్, ఫాస్పరస్, పిండి పదార్థాలు, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఉసిరి మన శరీరానికి అనేక రకాల పోషకాలను అందించి.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.. ఉసిరి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో చాలా సహాయపడతాయి.

ఉసిరిని ఎలా తీసుకోవచ్చో తెలుసుకోండి.

ఉసిరి పొడి: మీరు ఎండబెట్టడం ద్వారా ఉసిరి పొడిని తయారు చేసుకోవచ్చు. లేదా మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. మీరు ఈ పొడిని స్మూతీస్, పెరుగు లేదా గంజితో కలిపి తినవచ్చు. ఉసిరికాయ దాని పోషక గుణాలలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఉసిరి రసం: ఉసిరికాయను మెత్తగా నూరి దాని రసాన్ని తీసి అందులో కాస్త నల్ల ఉప్పు కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఉసిరికాయ పచ్చడి: ఉసిరికాయను తేలికగా ఆవిరి చేసి, మిరపకాయలు, పసుపు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, గరంమసాలా వంటి మసాలా దినుసులతో మ్యారినేట్ చేసి, రుచికి ఉప్పు వేసి బాగా కలపి పచ్చడి చేసుకోవచ్చు.. దీనితో ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.

ఉసిరి చట్నీ: ఉడకబెట్టిన ఉసిరిలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, పుదీనా ఆకులు, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసి చట్నీ తయారు చేసుకోవాలి. మీరు రోజులో ఎప్పుడైనా మీ భోజనంతో పాటు హాయిగా తినవచ్చు. ఇది జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది.

ఉసిరికాయ సలాడ్: క్యారెట్, బీట్‌రూట్, దోసకాయ, ముల్లంగి, అల్లం, కొన్ని ఆకు కూరలతో తురిమిన ఉసిరికాయను కలపడం ద్వారా సలాడ్ సిద్ధం చేసుకోవచ్చు.. ఇది ఆహారం రుచిని పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?