ఈ 5 అలవాట్లతో రాత్రుళ్ళు ప్రశాంతమైన నిద్ర..
TV9 Telugu
08 May 2024
సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల చాలామందికి సరైన నిద్ర ఉండదు. కారణంగా మరుసటి రోజు చాలా అలసిపోయినట్లు కనిపిస్తారు.
స్క్రీన్‌కు దూరంగా ఉన్నప్పుడు మెలటోనిన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ పీనియల్ గ్రంథి నుంచి విడుదలవుతుంది ఇది నిద్రపోవడానికి సహాయపడుతుంది.
అందువల్ల రాత్రిపూట నిద్రించడానికి గంట ముందు అన్ని గాడ్జెట్‌లను ఆపివేయాలి. ఇలా చేస్తే హాయిగా నిద్రపడుతుంది.
పుస్తకం చదవడం మంచి అలవాటు. దీనివల్ల మనస్సు రిలాక్స్ అవుతుంది. నిద్రించే ముందు మీకు ఇష్టమైన పుస్తకాన్ని చదవవచ్చు.
కొన్ని వేడి పానీయాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. పసుపు పాలు తాగితే మెదడుకు, పేగుకు ప్రయోజనకరంగా ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మంచి నిద్ర కోసం స్నానం చేయడం మంచి ఎంపిక. ఇది మీ నిద్రను మెరుగుపరుస్తుంది. నిద్ర నాణ్యత కూడా బాగుంటుంది.
నిద్రపోయే ముందు శ్వాస వ్యాయామాలు చేయవచ్చు. యోగా నిపుణులు, ఆధ్యాత్మిక గురువులు నిద్రించే ముందు శ్వాస వ్యాయామాలు చేయాలని సిఫార్సు చేస్తారు.
నిజానికి నిద్రపోయే ముందు ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రంతా నిద్ర కూడా బాగా వస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి