ఈ కార్డులు ఉన్న ఓటు వేయొచ్చు.!

TV9 Telugu

08 May 2024

మీ దగ్గర ఓటర్ ఐడీ లేకపోతే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, భారత పాస్‌పోర్టు చూపించి కూడా ఓటు వెయ్యవచ్చు.

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉపయోగించి కూడా రానున్న ఎన్నికల్లో ఓటుని వినియోగించవచ్చు.

ఏదైనా బ్యాంకు గానీ, పోస్టాఫీస్ గానీ జారీ చేసిన పాస్‌బుక్ కూడా ఓటు కోసం ఉపయోగించవచ్చు. అయితే ఆ పాస్‌బుక్‌పై అభ్యర్థి ఫోటో తప్పకుండా ఉండాలి.

మీ దగ్గర కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు ఉన్న కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డుతో కూడా ఓటు వెయ్యవచ్చు.

ఫోటోగ్రాఫ్‌తో పెన్షన్ డాక్యుమెంట్. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన గుర్తింపు కార్డులతో కూడా ఓటు వెయ్యవచ్చు.

మీరు ప్రభుత్వ అధికారుల అయితే ఫోటోగ్రాఫ్‌తో కూడిన మీ సర్వీస్ గుర్తింపు కార్డులతో కూడా ఎన్నికల్లో ఓటు వెయ్యవచ్చు.

కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజేబులిటి గుర్తింపు కార్డు ద్వారా ఓటు ఉపయోగించవచ్చు.