local trains: ఆ రాష్ట్రంలో ప్రారంభంకానున్న లోకల్ ట్రైన్లు.. ఎప్పటి నుంచి నడవనున్నాయంటే?సాధారణ ప్రయాణికుల అనుమతి అప్పటి నుంచే
మహారాష్ట్ర ప్రజల జీవితాల్లో భాగమైన లోకల్ రైళ్లలో ఫిబ్రవరి 1 నుంచి సాధారణ ప్రజలను అనుమతిస్తున్నట్లు మహా సర్కార్ ప్రకటించింది. రాష్ట్రంలో...

మహారాష్ట్ర ప్రజల జీవితాల్లో భాగమైన లోకల్ రైళ్లలో ఫిబ్రవరి 1 నుంచి సాధారణ ప్రజలను అనుమతిస్తున్నట్లు మహా సర్కార్ ప్రకటించింది. రాష్ట్రంలో కొవిడ్ లాక్‌డౌన్ ఆంక్షలను ఫిబ్రవరి 28 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతేడాది మార్చిలో కరోనా కారణంగా ఆగిపోయిన ఈ లోకల్ రైళ్లను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు.
ప్రత్యేక వేళలు…
ఫిబ్రవరి 1 నుంచి సాధారణ ప్రజలకు అనుమతించినా.. దానికి ప్రత్యేక సమయాలను కేటాయించారు. ఉదయం 7 గంటల లోపు, మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు, రాత్రి 9 గంటల తర్వాతే ప్రజలను ఈ రైళ్లలో అనుమతించనున్నారు. కాగా దేశంలోనే అత్యధిక మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నరైల్వే వ్యవస్థ ముంబై రైల్వే అగ్రస్థానంలో ఉంటుంది. ఇక మహారాష్ట్ర లోకల్ రైళ్లలో సగటున రోజుకు లక్షల్లో ప్రయాణికులు వారివారి గమ్యస్థానాలకు చేరుతారు. అయితే కరోనా కేసుల తగ్గుదల, టీకా ప్రక్రియ కొనసాగడంతో లోకల్ ట్రైన్లకు సర్కారు పచ్చజెండా ఊపింది. దీంతో సామాన్య ప్రయాణికులతో పాటు ఉద్యోగస్తులకు ప్రయాణం సులభతరం కానుంది.