Lockdown: ఫిబ్రవరి చివరి వరకు ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్.. ముంబైలో ప్రారంభం కానున్న లోకల్ ట్రైన్స్
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది...

Lockdown Extended in Maharashtra: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా లోకల్ రైళ్లను ఫిబ్రవరి 1 నుంచి సాధారణ ప్రజల కోసం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. కరోనావైరస్ మహమ్మారికి సంబంధించిన ప్రస్తుత మార్గదర్శకాలు వచ్చెనెల చివరి వరకు అమల్లో ఉంటాయని ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. గతంలో ప్రభుత్వం పునరుద్ధరించిన, అనుమతించిన మార్గదర్శకాలన్నీ కొత్తగా ప్రకటించే వరకు కొనసాగుతాయని మహా సర్కార్ తెలిపింది.
ముంబై సాధారణ ప్రజలకు జీవనాధారమైన లోకల్ ట్రైన్స్‌ను 1 నుంచి సమయానుకూలంగా ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనికోసం ప్రత్యేక సమయాలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సాధారణ ప్రజలను మొదటి ట్రైన్ ప్రారంభం నుంచి ఉదయం 7 గంటలలోపు, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 గంటల నుంచి చివరి రైలు సమయం వరకు అనుమతించనున్నట్లు వెల్లడించింది. గతేడాది మార్చిలో కరోనా లాక్‌డౌన్ నాటినుంచి రైళ్లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దశల వారీగా రైళ్లు ప్రారంభమవుతున్నాయి.
Also Read:
దేశంలో కొత్తగా 18,855 పాజిటివ్ కేసులు, 163 మరణాలు.. 97 శాతానికి చేరువైన రికవరీ రేటు..
Mask Over The Mask: మాస్క్‌పై మాస్క్ ధరించడం వల్ల మరింత రక్షణ.. ఎవరు చెప్పారో తెలుసా..