AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Need Time to Bring Out Truth: నేను ఏ తప్పు చేయలేదు సాక్షాధారాలతో విచారణకు హాజరవుతా.. టైం ఇవ్వండి : దీప్ సిద్ధూ

ప్రపంచ దేశాలు అన్నీ దేశ రాజధాని ఢిల్లీ వైపు ఆసక్తిగా చూస్తున్న వేళ రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ జరిగిన ఉద్రిక్తతకు కారణం.. పంజాబీ నటుడు, కార్యకర్త దీప్‌ సిద్ధూఅని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధూ..

Need Time to Bring Out Truth: నేను ఏ తప్పు  చేయలేదు సాక్షాధారాలతో విచారణకు హాజరవుతా.. టైం ఇవ్వండి : దీప్ సిద్ధూ
Surya Kala
|

Updated on: Jan 29, 2021 | 2:01 PM

Share

Need Time to Bring Out Truth: ప్రపంచ దేశాలు అన్నీ దేశ రాజధాని ఢిల్లీ వైపు ఆసక్తిగా చూస్తున్న వేళ రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ జరిగిన ఉద్రిక్తతకు కారణం.. పంజాబీ నటుడు, కార్యకర్త దీప్‌ సిద్ధూఅని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధూ సోషల్ మీడియా వేడుకగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. తాను పోలీసుల విచారణకు సహకరిస్తానని.. అయితే అందుకు కొంత సమయం కావాలని అడిగాడు సిద్ధూ.

తనపై అరెస్ట్ వారెంట్ ఉందని.. లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారని.. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని చెప్పాడు. అలాంటి వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని.. తాను తప్పకుండా విచారణకు హాజరవుతానని… తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని అన్నారు.. అసలు ఏ తప్పు చేయాలని నేను ఎందుకు పారిపోవాలి.. ఎందుకు భయపడాలని ఆ వీడియో ద్వారా తెలిపారు. తన పై వస్తున్న వదంతులను అవాస్తవాలని నిరూపించుకుంనేందుకు తనకు కొంత సమయం కావాలని.. రెండు రోజులు గడువు ఇస్తే ఎర్రకోట దగ్గర జరిగిన సంఘటనలకు సంబంధించిన నిజాలన్నీ బయటపెడతానన్నారు సిద్ధూ.. అప్పుడు సాక్ష్యాలతో విచారంలో పాల్గొంటానని ఫేస్ బుక్ లో ఓ వీడియో ద్వారా తెలిపారు.

జనవరి 26న దిల్లీలో ఉద్రిక్తకర పరిస్థితులకు దీప్‌ సిద్ధూనే కారణమని, రైతులు ఎర్రకోటవైపు వెళ్లేలా ఆయనే రెచ్చగొట్టారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక, ఎర్రకోటపై మతపరమైన జెండాతో పాటు రైతుల జెండా ఎగురవేసిన సమయంలో సిద్ధూ అక్కడే ఉన్నారు. జెండాలు ఎగరవేయడాన్ని సమర్థిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ లు చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఘటన తర్వాత నుంచి సిద్ధూ కన్పించకుండా పోయారు. సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తున్నారు.

Also Read:  జింకలు కొత్త కారుతో ఢీ కొట్టిన వ్యక్తి… రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు ఎలాగో తెలుసా..!