Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Man Hits 2Deer With NewCar: జింకలను కొత్త కారుతో ఢీ కొట్టిన వ్యక్తి… రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు ఎలాగో తెలుసా..!

ఓ మనిషికి అదృష్టం ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు.. ఒకొక్కసారి మనం జీవితంలో పోగొట్టుకున్నాం... దురదృష్టం వెంటాడింది అనుకునే సమయంలో అదృష్టం మరో రూపంలో పలకరిస్తే.. ఆ వ్యక్తి సంతోషానికి హద్దే ఉండదు.. అలా అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి లక్మిదేవి తలుపు తట్టి..

Man Hits 2Deer With NewCar:  జింకలను కొత్త కారుతో ఢీ కొట్టిన వ్యక్తి... రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు ఎలాగో తెలుసా..!
Follow us
Surya Kala

|

Updated on: Jan 31, 2021 | 5:49 AM

Man Hits 2Deer With NewCar: ఓ మనిషికి అదృష్టం ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు.. ఒకొక్కసారి మనం జీవితంలో పోగొట్టుకున్నాం… దురదృష్టం వెంటాడింది అనుకునే సమయంలో అదృష్టం మరో రూపంలో పలకరిస్తే.. ఆ వ్యక్తి సంతోషానికి హద్దే ఉండదు.. అలా అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి లక్మిదేవి తలుపు తట్టి.. రాత్రికి రాత్రే అతడిని కోటీశ్వరుడిని చేసేసింది. బ్రాండ్ న్యూ కారుతో జింకలు ఢీకొట్టి మనస్థాపానికి గురైన అతడిని ఊహించని విధంగా లక్ వరించింది. మనోవేదనతో ఉన్న అతడు ఓ లాటరీలో ఏకంగా రూ. 20 లక్షల డాలర్లును సొంతం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

నార్త్ కరోలినాకు చెందిన ఆంటోనీ డోవ్ తాను కొన్న కొత్తకారులో ఆఫీసుకు బయలుదేరాడు. అయితే.. మార్గ మధ్యలో సడెన్‌గా రోడ్డు మీదకు రెండు జింకలు దూసుకొచ్చాయి. కారు కంట్రోల్ చేయలేక..ఆ జింకలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు డామేజ్ అయ్యింది. దీంతోరిపేర్ చేయించడానికి ఎంత ఖర్చుపెట్టాలో అంటూ అతను నిద్ర పోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు. అయితే ఉదయం నిద్రలేచే సరికి అతడి జీవితమే మారిపోయింది. అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ల నెంబర్లను చెక్ చేసుకున్న ఆంథోనీకి షాకింగ్ న్యూస కనిపించింది. అతను ఏకంగా 2 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 14.6 కోట్లు గెలుచుకున్నాడు.

వాస్తవానికి అతడు గెలుచుకున్నది 1 మిలియన్ డాలర్లు మాత్రమే. ఆంథోనీ ఆ టికెట్‌‌ను స్టోర్‌లో ఇచ్చి ప్రైజ్ మనీ కోసం తీసుకోడానికి వెళ్లగా.. అక్కడ మరో టికెట్ కూడా గెలుచుకున్నాడు. దీంతో అతడి మొత్తం రెట్టిపయ్యింది. పన్నులు చెల్లించగా అతడికి 1.4 మిలియన్ డాలర్లు అంటే 10.2 కోట్లు చేతికి అందాయి. లాటరీ హెడ్ క్వార్టర్‌లో చెక్‌ అందుకుని ఆంథోనీ సంతోషం వ్యక్తం చేస్తూ.. తాను ఈ డబ్బుతో కారుని రిపేర్ చేయించుకుంటానని.. తల్లిదండ్రుల ఇంటికి మరమ్మతులు చేయిస్తానని చెప్పాడు. ఈ వివరాలను నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ వెల్లడించింది.

Also Read: ఆ దేశ అధ్యక్షుడిని హత్య చేయడానికి విషపు ఉత్తరాన్ని పంపిన గుర్తు తెలియని వ్యక్తులు.. సహాయకురాలికి అస్వస్థత