Gold: ప‌సిడిపై ప్రేమ త‌గ్గింది… కార‌ణం క‌రోనానా..? ధ‌ర‌ల పెరుగుద‌ల‌నా..? డిమాండ్ ఎంత త‌గ్గిందంటే..?

భార‌త‌దేశంలో వేడుక ఏదైనా బంగారం కొనాల్సిందే... పేద‌వారి నుంచి ధ‌నికుల వ‌ర‌కు అంద‌రి వినిమ‌య వ‌స్తువు పుత్త‌డి. అయితే బంగారం

Gold: ప‌సిడిపై ప్రేమ త‌గ్గింది... కార‌ణం క‌రోనానా..? ధ‌ర‌ల పెరుగుద‌ల‌నా..? డిమాండ్ ఎంత త‌గ్గిందంటే..?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 30, 2021 | 11:59 AM

భార‌త‌దేశంలో వేడుక ఏదైనా బంగారం కొనాల్సిందే… పేద‌వారి నుంచి ధ‌నికుల వ‌ర‌కు అంద‌రి చేత వినిమ‌య వ‌స్తువు పుత్త‌డి. అయితే బంగారం కొనుగోళ్లపై కరోనా వైరస్‌ ప్రభావం పడింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గతేడాది భారతీయ మార్కెట్‌లో పుత్తడి డిమాండ్‌ 446.4 టన్నులకే పరిమితమైంది. 2019లో 690.4 టన్నుల పసిడికి గిరాకీ కనిపించిందని ‘గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ రిపోర్టు-2020’లో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. దీంతో 2020లో 35.34 శాతం డిమాండ్‌ పడిపోయినట్లు స్పష్టం చేసింది. అధిక ధరలూ డిమాండ్‌ను అనూహ్యంగా తగ్గించేశాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా అదే ప‌రిస్థితి…

అంతర్జాతీయ స్థాయిలోనూ బంగారానికి డిమాండ్‌ పడిపోయింది. గతేడాది ఏకంగా 11 ఏండ్ల కనిష్ఠానికి క్షీణించింది. 3,759.6 టన్నుల పుత్తడికే ఆదరణ కనిపించినట్లు డబ్ల్యూజీసీ తెలియజేసింది. 2019లో 4,386.4 టన్నుల డిమాండ్‌ ఉన్నట్లు పేర్కొన్నది. 2009లో 3,385.8 టన్నుల డిమాండ్‌ నమోదవగా, మళ్లీ ఆ స్థాయి దరిదాపుల్లో గతేడాదే చూశామని వెల్లడించింది. డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం మాట్లాడుతూ… నిరుడు అక్టోబర్‌-డిసెంబర్‌లో బంగారంపట్ల కొనుగోలుదారులు మళ్లీ ఆసక్తి కనబరిచారు. ఈ మూడు నెలల్లో దేశీయంగా 186.2 టన్నులకు డిమాండ్‌ వ్యక్తమైంది. రానున్న రోజుల్లోనూ బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగ‌దారులు ఆస‌క్తి చూపుతార‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.