Viral Video: పోనీలే పాపం అని దయ చూపించింది.. లేదంటేనా..!బతుకు జీవుడా అనుకుంటూ పాకుతూ దేకుతూ పరుగో పరుగు..!!
సాధారణంగా ఏనుగు అంటే అందరూ ఇష్టపడతారు. ఏనుగును గజరాజుగా పిలుస్తారు. ఏనుగులు చూడ్డానికి ప్రశాంతంగానే కనిపిస్తాయి. కానీ వాటికి ఎవరైనా హాని తలపెడితే మాత్రం వాటి కోపం మామూలుగా ఉండదు. కోపం వచ్చినప్పుడు గజరాజు ఘీంకరించిందంటూ హడలిపోవాల్సిందే. అలాంటి సంఘటనలు తరచూ సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఏనుగుకి కోపం వచ్చిందంటే ఆ ప్రాంతమంతా...

సాధారణంగా ఏనుగు అంటే అందరూ ఇష్టపడతారు. ఏనుగును గజరాజుగా పిలుస్తారు. ఏనుగులు చూడ్డానికి ప్రశాంతంగానే కనిపిస్తాయి. కానీ వాటికి ఎవరైనా హాని తలపెడితే మాత్రం వాటి కోపం మామూలుగా ఉండదు. కోపం వచ్చినప్పుడు గజరాజు ఘీంకరించిందంటూ హడలిపోవాల్సిందే. అలాంటి సంఘటనలు తరచూ సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఏనుగుకి కోపం వచ్చిందంటే ఆ ప్రాంతమంతా బీభత్సం సృష్టిస్తుంది.
చిర్రెత్తుకొచ్చిన ఏనుగుకు చిన్న పెద్ద తేడా ఉండదు.. భారీ వృక్షాలను సైతం కూకటి వేళ్లతో నేల కూల్చేస్తాయి. భారీ ఇళ్లను కూడా క్షణాల్లో ధ్వంసం చేసేస్తాయి. అయితే, ఓ ఏనుగు నుంచి ఇద్దరు వ్యక్తులు ఎదుర్కొన్న భయానక అనుభవానికి సంబంధించని వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
ఏనుగును దగ్గర నుంచి చూసేందుకు ప్రయత్నించి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు ఓ వ్యక్తి. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని మైసూరు రోడ్డుపై జరిగింది. ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తుండగా వారికి ఏనుగు కనిపించింది. దీంతో కారు దిగి దానిని దగ్గరి నుంచి చూసే సాహసం చేశారు. అంతే, ఇంకేముంది.. ఆ ఏనుగు వారిని ఓ ఆట ఆడేసుకుంది.. ఉన్నట్టుండి ఆ ఏనుగు వారిని వెంబడించింది. దాంతో బతుకు జీవుడా అనుకుంటూ ఆ ఇద్దరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగందుకున్నారు.
ఒకతను పరిగెత్తలేక కింద పడిపోయాడు. ఏనుగు అతన్ని తన వెనుక కాళ్లతో తన్నింది. ఇంకా నయం తొక్కేయలేదు. ఎందుకో అతనిమీద దయదలచి తొక్కకుండా వదిలిపెట్టింది. దెబ్బకు అక్కడినుంచి పాకుతూ వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. ఏనుగు బతుకుపో మరోసారి నాతో ఆటలాడాలని ప్రయత్నిస్తే మామూలుగా ఉండదు అన్నట్టుగా అక్కడినుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో చూడండి:
View this post on Instagram
